Home breaking news కాంగ్రెస్ తాత్కాలిక ప్రెసిడెంట్​గా సోనియాగాంధే

కాంగ్రెస్ తాత్కాలిక ప్రెసిడెంట్​గా సోనియాగాంధే

156
0
కాంగ్రెస్ తాత్కాలిక ప్రెసిడెంట్గా సోనియాగాంధే
సోనియాగాంధీ

కాంగ్రెస్ తాత్కాలిక​ ప్రెసిడెంట్​గా సోనియాగాంధీనే ఎన్నుకున్నారు. అయితే ఈమే తాత్కాలికంగానే..ప్రెసిడెంటని నిర్ణయం తీసుకున్నారు. కొత్త వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే వరకూ సోనియా కొనసాగుతారని ఆ పార్టీ సీనియర్​ నేతలు కేసీ వేణుగోపాల్​ ప్రకటించేశారు. లోక్​సభ ఎన్నికల ముందు ఇక కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినట్టే అని సంబురంగా ఉన్న నేతలు తీరా ఫలితాలు రాగానే డంగై పోయారు. రాహుల్​ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇక తానే ప్రధానమంత్రిని అని ఊహల్లో తేలియాడుతున్న ఆయనకు ఈ ఫలితాలు షాక్​ ఇచ్చాయి. దీంతో మైండ్​ బ్లాక్​ అయిన ఆయన.. అనుకున్నదొకటి అయిందొకటి అనుకుంటూ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. రాజీనామా చేసి మూడు నెలలు అవుతోంది. ఇప్పటివరకూ అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోయింది కాంగ్రెస్​. చిరవకు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసుకొని సోనియాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఐదు కమిటీలు కడా వేశారు. ఇక అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారో.. దీనికి ఎన్నాళ్లు పడుతుందో చూడాలి. పనిలోపనిగా రాహుల్​గాంధీ రాజీనామాను సీడబ్ల్యూసీ అంగీకరించింది. తన రాజీనామాను అంగీకరించినందుకు రాహుల్​.. కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. చివరకు తల్లిపోయి కొడుకు వచ్చే.. కొడుకు పోయి తల్లీ వచ్చే అన్నట్టుగా ఉంది కాంగ్రెస్​ పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here