Home breaking news కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ సూప‌రో సూప‌రు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ సూప‌రో సూప‌రు

123
0
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ సూప‌రో సూప‌రు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ త‌రువాత ఇక్క‌డ ఉన్న మంచి వ‌క్త‌ల్లో ఎంపీ రేవంత్‌రెడ్డి ఒక‌రు. హ‌రీశ్‌రావు, కేటీఆర్ ఉన్నార‌నుకో. కానీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న మంచి వ‌క్త మాత్రం క‌చ్చితంగా రేవంత్‌రెడ్డి ఒక్క‌రే అని ఢంకా భ‌జాయించి చెప్పొచ్చు. తాను చెప్ప‌ద‌లుకున్న‌ది ప‌త్రిక‌ల్లో వ‌చ్చే విధంగా.. ప్ర‌జ‌ల‌కు చేరే విధంగా చెప్పేస్తారు. అందుకే సోష‌ల్ మీడియాలో రేవంత్‌రెడ్డికి ఉన్న క్రేజే క్రేజు. ఆయ‌న వీడియో ఏది చూసినా వ్యూస్ పెద్ద సంఖ్య‌లో ఉంటాయి. లైక్‌ల సంగ‌తి స‌రే స‌రి. విష‌యానికొస్తే కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరిపోతార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌చారంలో క‌చ్చితంగా రేవంత్‌రెడ్డి పేరును మాత్రం వాడుకుంటున్నారు. ఆ త‌రువాత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పేరు కూడా లీస్ట్‌లో ఉంది.

ప్ర‌చార‌మే క‌దా జ‌ర‌గ‌నీయ్ అని ఇన్ని రోజులుగా రేవంత్ కూడా ఈజీగా తీసుకున్న‌ట్టున్నారు. చివ‌ర‌కు తిరుప‌తి వెంక‌న్న స‌న్నిధికి వెళ్లినా.. వ‌ద‌ల‌లేదు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకొని రేవంత్ రావ‌డం.. ఆయ‌న కోసం అక్క‌డే కాచుకొని కూచున్న మీడియా ప్ర‌తినిధులు మీరు బీజేపీలోకి వెళ్తున్నారంట‌గా..? అని క్వ‌చ్ఛ‌న్ వేయ‌డం జరిగి పోయింది. పంచ్ వేయ‌డంలో రేవంత్ సిద్ధ‌హ‌స్తుడేగా..బీజేపీలో మోదీ ఉండ‌గా.. నేను ఎందుకు వెళ్తా. నేను వెళ్లినా.. న‌న్ను ప్ర‌ధానిని చేయ‌రు క‌దా..? అని పంచ్ విసిరారు. ఆ త‌రువాత బుర్ర ఉన్న‌వాడు బీజేపీలోకి వెళ్ల‌డు అంటూ మాట్లాడాడ‌నుకో.. కానీ మొద‌ట వేసిన పంచ్ సూప‌రో సూప‌ర్ క‌దా. ప‌త్రిక‌ల్లో అదే అచ్చయింది. కానీ ఇక్క‌డో అనుమానం అంద‌రికీ క‌లుగుతోంది. అదేంటంటే.. టీడీపీని వీడి.. కాంగ్రెస్‌లోకి రేవంత్ వెళ్లేముందు త‌న మాతృసంస్థ‌ బీజేపీని కూడా ట‌చ్ చేశాడంట‌.. అయితే అక్క‌డ నుంచి సానుకూల‌త రాలేద‌ని ప్ర‌చారం మాత్రం జ‌రిగింది. ఇందులో నిజ‌మెంతో .. అబద్ధ‌మెంతో ఇటు రేవంత్‌కు.. అటు బీజేపీకే మాత్ర‌మే తెలుసు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here