Home breaking news కాంగ్రెస్‌ను చంద్ర‌బాబుకు అప్ప‌జెప్పండి.. రాహుల్ రాజీనామా ఎపిసోడ్‌లో కామెంట్ల‌ ట్విస్ట్‌లు

కాంగ్రెస్‌ను చంద్ర‌బాబుకు అప్ప‌జెప్పండి.. రాహుల్ రాజీనామా ఎపిసోడ్‌లో కామెంట్ల‌ ట్విస్ట్‌లు

241
0

అధ్య‌క్షుడిగా ఉండ‌మంటే విన‌క‌పోతివి. ఉండ‌నంటే ఉండ‌న‌ని రాజీనామా చేస్తివి. మంచి నిర్ణ‌యం. పోతే పోతివిగాని.. అంటూ రాహుల్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్లు మ‌న‌కు క‌నబ‌డ‌తాయి. నెల‌కు పైగా సాగిన రాజీనామా ఎపిసోడ్కు నిన్న రాహుల్ ముగింపు ప‌లుకుతూ రాజీనామా నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డే ఉన్నాన‌ని, ఎందుకు రాజీనామా చేశానో వివ‌రించారు. ఆ త‌రువాత నాలుగు పేజీల లేఖ‌ను ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ లేఖ‌ను పెద్ద సంఖ్య‌లో జ‌నం చ‌దివారు. ప్ర‌తిగా అనేక మంది కామెంట్లు పెట్టారు.

ఈ కామెంట్ల‌లో చాలా మంది రాహుల్ త‌న నిర్ణయాన్ని మార్చుకోవాల‌ని కోరారు. 2024కు బాధ్య‌త వ‌హించాలి.. ఇప్పుడు అవ‌స‌రం లేదంటూ కొంద‌రు. ఇలా అనేక కామెంట్లు. పోతే పోతిరి ప్రియాంక‌కు బాధ్య‌త‌లు ఇవ్వండి అన్న కామెంట్లు మ‌న‌కు క‌న‌బ‌డ‌తాయి. నిన్న ఫేస్‌బుక్ కొంత ఇబ్బంది పెట్ట‌డం మూలానా.. అంద‌రూ కామెంట్లు పెట్ట‌క పోవ‌చ్చు. కానీ.. కామెంట్లు పెట్టిన 6000 మందిలో ఇలాంటివి కామెంట్లు బోలేడు.

రాజీనామా చేస్తే చేస్తివి కానీ ఈసారైన చెంచాల‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌కుండా స్వ‌యం నిర్ణ‌యాలు తీసుకునే వారికి బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని కొంద‌రు సూచించారు. రాజీనామా నిర్ణయానికి క‌ట్టుబ‌డి ఉండ‌డం మంచిద‌ని స్వాగ‌తించారు. కొంత‌ మంది మాత్రం పోతే పోతిరి పార్టీ బాధ్య‌త‌లు ప్రియాంకకు అప్ప‌జెప్పండని సూచించారు. సింధియా కుటుంబానికి చెందిన వ్య‌క్తికి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కోరారు. మ‌రికొంద‌రు ఆనంద్‌శ‌ర్మ‌, స‌చిన్ ఫైల‌ట్ వంటి వారి పేర్తు సూచించారు. అన్నింటిలో విచిత్రంగా ఒక కామెంట్ క‌న్పించింది.. అదేంటంటే.. కాంగ్రెస్ బాధ్య‌త‌లు చంద్ర‌బాబుకు ఇవ్వండని ఒక‌త‌ను పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here