Home breaking news కశ్మీర్​ మిలిటెంట్లకు షాకింగ్​ సలహా ఇచ్చిన గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​

కశ్మీర్​ మిలిటెంట్లకు షాకింగ్​ సలహా ఇచ్చిన గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​

201
0
కశ్మీర్​ మిలిటెంట్లకు షాకింగ్​ సలహా ఇచ్చిన గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​
గవర్నర్​ సత్యపాల్​ మాలిక్

’తుపాకులతో తిరుగుతున్న మీరు చంపదలచి వస్తే మీ తోటి ప్రజలను కాకుండా కశ్మీర్​ను దోచుకున్న అవినీతిపరులను, మీ దేశాన్ని దోచుకున్న దొంగలను చంపివేయండి. ఇప్పటి వరకూ అటువంటి వారిని ఎప్పుడైనా చంపారా..?’  కశ్మీర్​ మిలిటెంట్లను ఉద్ధేశించి జమ్మూ కశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్ మాలిక్​ ప్రశ్నించారు. ఈ కుర్రాళ్లు (మిలిటెంట్లు) అనవసరంగా తమ తోటి ప్రజలను, పోలీసులను చంపివేస్తున్నారని తెలిపారు. తుపాకులు ఏ సమస్యను పరష్కరించవని, ఎల్​టీటీఈ అనే ఒక పెద్ద సంస్థ ఇప్పుడేమయిందో అందరికీ తెలుసని మాలిక్ వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ తుపాకులకు లొంగదని ఆయన స్పష్టం చేశారు. మిలిటెంట్లలో చేరిన పిల్లలు 200 నుంచి 250 మంది మాత్రమే ఉన్నారని, వారు తమ ప్రాణాలను నిమిషాల వ్యవధిలో కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్​ ప్రజలు పేదరికంలో ఉంటే.. దీన్ని తగులబెట్టిన కుటుంబాలకు  మాత్రం ఢిల్లీ, దుబాయ్​, లండన్​ సహా వివిధ దేశాల్లో సంపాదించుకున్న ఆస్తులు కూడబెట్టుకున్నారని సత్యపాల్​ మాలిక్​ తెలిపారు. గతంలో మంత్రులుగా పని చేసిన వారు, అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. శ్రీనగర్​లోని ఒక పెద్దహోటల్లో  రాజకీయ నాయకుడికి వాటా ఉంది. మరో నాయకుడికి ఇంకోచోట భాగస్వామి ఇలా అనేక ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నాని చెప్పారు. అయితే అవినీతిపరులపై ప్రజల కూడా ఒత్తిడి తేవాలని సత్యపాల్​ మాలిక్​ పిలుపునిచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here