Home breaking news కలిసొచ్చిన వర్షం.. కేసీఆర్ పర్యటన రద్దు.. ఆనందంలో కొందరు

కలిసొచ్చిన వర్షం.. కేసీఆర్ పర్యటన రద్దు.. ఆనందంలో కొందరు

253
0

కలిసొచ్చిన కాలానికి.. అంటూ పెద్దోళ్లు చెప్పిన మాట యాదికుందిగా.. అట్లనే కేసీఆర్​కు కలిసొచ్చింది. వర్షం కురిసింది. హుజూర్​నగర్​ పర్యటన రద్దైంది. ఎక్కడ కేసీఆర్​ వస్తడో.. ఏం గడబిడ అయితదో అని భయపడుతున్న పోలీసోళ్ల గుండెలు సంతోషంతో ఊగిపోతున్నాయి. ఒక్క పోలీసోళ్లే కాదు.. టీఆర్​ఎస్​ నేతల గుండెలు కూడా. హుజూర్​నగర్​ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21న పోలింగ్​ జరుగనుంది. దీనికి సంబంధించి ప్రచారం చేయడానికి కేసీఆర్​ 17న బహిరంగసభ ఏర్పాటు చేసిండు. ఇంత వరకూ బాగానే ఉంది. ఒక పక్క ఆర్టీసీ సమ్మె.. చర్చల్లేవు గిర్చల్లేవంటూ కేసీఆర్​ ప్రకటన. గూండాగిరి చేస్తరా.? అంటూ ఆగ్రహం.

జనంలో సర్కారు పట్ల అసహనం. ఒక డ్రైవర్​ ఆత్మహత్య. ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహం. ఇప్పటికే ముగ్గురు పెద్దాఫీసర్లపై బదిలీ వేటు. ఈ సమయంలో కేసీఆర్​ బహిరంగ సభ. పరిస్థితి ఎట్లుంటది. పోలీసోళ్ల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉండే. కేసీఆర్​ బహిరంగసభ పెడితే.. ఆర్టీసోళ్ల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఉంటుందో అన్న ఆందోళన. అరెస్టులు, లాఠీచార్జీలు వంటివి తలెతుతాయోనన్న భయాందోళన. ఏం జరిగినా.. కేంద్రం పెద్దలకు చెప్పడానికి రెడీగా ఉన్న బీజేపీ. భయంగా భయంగా ఉన్న పోలీసోళ్లకు.. వర్షం కారణంగా కేసీఆర్​ సభ రద్దు కావడాన్ని మించిన ఆనందం ఏముంటుంది చెప్పు.

ఇక టీఆర్​ఎస్ వాళ్ల ఆనందమైతే చెప్పనలవి కాదు. పెద్దాఫీసర్ల మీటింగ్​లోనే ఆర్టీసీ సమ్మె గురించి కేసీఆర్​ ఏమోమో మాట్లాడబట్టే. ఇక సభ జరిగితే ఏం మాట్లాడుతాడో..? పబ్లిక్​ రియాక్షన్​ ఎట్లుంటదో అన్న గుబులు. ఏమన్నా లొల్లి జరిగితే కేసీఆర్​ తమను ఏమంటాడో అన్న భయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్​ఎస్​ నేతలు గుండెలు చేతుల బట్టుకొని కూర్చున్నరు. ఏదన్నా జరిగి మీటింగ్​ ఆగితే బాగుండన్న ఆశలో కూడా టీఆర్​ఎస్​ వాళ్లున్నరంట. వీళ్ల మొర ఆలకించిడేమో వాన దేవుడు వానకొట్టించుడు. కేసీఆర్​ పర్యటన రద్దైంది. ఇక టీఆర్​ఎస్​ నేతలకు ఎంత ఆనందంగా ఉందో. ఒక్క మాటలో చెప్పాలంటే బాగా ఆకలిమీద ఉన్నోడికి పచ్చిపులుసుతో బువ్వ పెట్టినా.. ఎంత ఆనందంగా తింటడో అంత ఆనందంగా ఉన్నరట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here