Home తాజా వార్తలు ఓట్ల కోసం బ్లాక్ మెయిలింగ్ | sakshi maharaj

ఓట్ల కోసం బ్లాక్ మెయిలింగ్ | sakshi maharaj

135
0

బ్లాక్ మెయిలింగ్‌లో ర‌కాలుంటాయి. స్థాయికి త‌గ్గ‌ట్టుగా బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. ఇందులో ఓట్ల కోసం, ప్రేమ కోసం ఇలా ఎన్నో ర‌కాలుంటాయి. నేను చెప్పిన‌ట్టు చేయాలి అన్న దోర‌ణి క‌న్పిస్తుంది. ప్రేమ బ్లాక్ మెయిలింగ్ గురించి అంద‌రూ ఆస‌క్తిక‌రంగా చూస్తారు. వింటారు. ప్రేమించ‌క పోతే చ‌స్తా అని ఒక‌డు. యాసిడ్ గుప్పుతా అని ఇంకొక‌డు. చంపుతా అని ఒక‌డు. పెళ్లి చేసుకోకుంటే చ‌స్తా అని ఒక‌రు. ఇవి ప్రేమ‌ బ్లాక్ మెయిలింగ్ ర‌కాలు. ఇక ఐదేళ్ల కోసారి ఓట్ల బ్లాక్ మెయిలింగ్ ఇది అంత ఆస‌క్తిక‌రంగా ఉండ‌దు. ఇది బ‌తిమాలే పేరుతో బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది. ఇది చేసినోడి అవ‌త‌లిప‌క్షం ప్ర‌చారం చేసుకోవ‌డానికి ప‌ని చేస్తుంది. ఈ రెండు ర‌కాల్లో స్థాయిని బట్టి బ్లాక్ మెయిలింగ్ తీవ్ర‌త ఉంటుంది. ఇప్పుడు ఓట్ల సీజ‌న్. గ‌తేడాని అక్టోబ‌ర్‌లో మొద‌లైన ఈ సీజ‌న్ ఈ ఏడాది అక్టోబ‌ర్ వ‌ర‌కూ న‌డుస్తూనే ఉంటుంది. మొన్న‌టి దాక ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓట్ల కోసం చేసిన బ్లాక్ మెయిలింగ్ ఈసారి ఆసక్తిక‌రంగానే ఉంది. నాకు ఓటేయ‌కుంటే.. మీరు బ‌త‌క‌లేరు. బ‌త‌క‌నీయ‌రు. నేనే మీకు అండ‌. అవ‌తలోళ్లు మిమ్ముల‌ను దోచుకుంటరు. నేనైతే కాపాడ‌గ‌లుగుతా. ఇలా ఓట్ల కోసం బ‌తిమాలుతూనే బ్లాక్ మెయిలింగ్‌కు పాల్ప‌డ్డారు. అక్క‌డ ఎన్నిక‌లై పోయిన‌యి. రిజ‌ల్ట్ కోసం వెయిటింగ్‌. ఇప్పుడు దేశంలో ఇంకా మిగిలిన‌ ద‌శ‌ల పోలింగ్ జ‌రుగ‌నుంది. దీని కోసం మోదీ స్థాయిలో మోదీ, రాహుల్ స్థాయిలో రాహుల్ ఓట్ల బ్లాక్ మెయిలింగ్ చేస్తూనే ఉన్న‌రు. ఇది చూడ‌డానికి బ్లాక్ మెయిల్‌గా క‌న్పించ‌దు. బీజేపీ త‌రుపున పోటీ చేస్తున్న సాక్షి మ‌హరాజ్‌,మేన‌క గాంధీ వీరిద్ద‌రూ త‌మ‌దైన శైలిలో ఓట‌ర్ల‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న‌రు. నేను స‌న్యాసిని నాకు ఓటేయ‌కుంటే శ‌పిస్తాన‌ని. మీరు సుఖాల‌కు దూర‌మే చేసిన పాపాల‌కు న‌ర‌కానికి పోతారంటూ ప్ర‌చారంలో ఓట‌ర్ల‌ను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఇక మేన‌కాగాంధీ.. నేను ఎట్ల‌యినా గెలుస్తా క‌నీ, ముస్లింల ఓట్లు ప‌డ‌కుండా గెలిస్తే బాగుండ‌దు కాబట్టి.. మీరంద‌రూ ఓటేయాలి నాకు. నాకు ఓటేయ‌కుంటే రేపు ప‌నులు చేయ‌మ‌ని ఎలా అడుతరంటూ త‌న‌దైన శైలిలో బ్లాక్ మెయిల్ చేశారు. ఇట్ల అనేక మంది చేస్తారు కానీ ఎక్కువ‌గా వీళ్ల‌యే బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. ఎందుకంటే ప‌త్రిక‌ల్లో ఎక్కువ మంది ఎర్ర సైనికులే ఉన్నారు కాబ‌ట్టి.. వాళ్ల‌కు ఈ కాషాయ సైనికులకు ప‌డ‌దు కాబ‌ట్టి అందుకే వీరియే ప‌త్రిక‌ల్లో వ‌స్తాయి.
Please Subscribe our Website And Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here