Home Uncategorized ఒక్క‌దెబ్బ‌కు నాలుగు వికెట్లు.. క‌మ‌లం గూటిలో న‌లుగురు టీడీపీ ఎంపీలు.. ట‌చ్‌లో కేశినేని

ఒక్క‌దెబ్బ‌కు నాలుగు వికెట్లు.. క‌మ‌లం గూటిలో న‌లుగురు టీడీపీ ఎంపీలు.. ట‌చ్‌లో కేశినేని

120
1
బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రి

pmన్యూఢిల్లీ: బీజేపీ కొట్టిన ఒకే ఒక్క దెబ్బ‌కు టీడీపీ వికెట్లు నాలుగు ప‌డిపోయాయి. ఎన్నిక‌ల ముందు.. టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు.. వ్య‌వ‌హ‌రించిన తీరుకు.. బీజేపీ ఈ విధంగా బ‌దులిచ్చింది. బీజేపీ కొట్టిన ఆ దెబ్బ‌కు టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు.. క‌మ‌లం గూటిలోకి చేరుకున్నారు. ఎంపీలు సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేశ్‌, సీఎం ర‌మేశ్‌, గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు బీజేపీ కండువాలు క‌ప్పుకున్నారు. అంత‌మ‌కు ముందు తాము టీడీపీకి రాజీనామా చేస్తున్న‌ట్టుగా.. న‌లుగురు ఎంపీలు రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడుకు లేఖ ఇచ్చారు. త‌మ‌ను ఏ పార్టీకి అనుబంధంగా కాకుండా.. ప్ర‌త్యేక గ్రూప్‌గా గుర్తించాల‌ని కోరారు. త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోస‌మే తాము బీజేపీలో చేరుతున్నామ‌ని చెప్పారు. గురువారం ఉద‌య‌మే ప్ర‌ధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను వీరు క‌లిసిన సంగ‌తి తెలిసిందే. కాగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ లోక్‌స‌భ ప‌క్ష ఉపనేత ప‌ద‌వి ఇచ్చినా.. నాని తీసుకోని సంగ‌తి తెలిసిందే.

నా బంధం పాత‌దే- టీజీ

బీజేపీతో నా అనుబంధం పాత‌దే అని ఎంపీ టీజీ వెంక‌టేశ్ తెలిపారు. విద్యార్థిగా ఉన్న‌ప్పుడు ఏబీవీపీలో ప‌ని చేశాన‌ని, ఆ త‌ర్వాత యువ‌మోర్చ ఉపాధ్య‌క్షుడిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌హించాన‌ని చెప్పారు. ఈయ‌న ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త కూడా.

1 COMMENT

  1. Heya i am for the first time here. I came across this board and
    I find It truly useful & it helped me out a lot. I hope to give something back and aid others
    like you aided me.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here