Home breaking news ఏమో సిక్కీంలో జరిగినట్టు.. తెలంగాణలోనూ జరగవచ్చేమో..!

ఏమో సిక్కీంలో జరిగినట్టు.. తెలంగాణలోనూ జరగవచ్చేమో..!

121
0
బీజేపీలో చేరిన సీడీఎఫ్​ ఎమ్మల్యేలు

సిక్కింలో జరిగినట్టు తెలంగాణలోనూ జరగవచ్చేమో..! ఇది తెలంగాణలో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న చర్చ. రెండ్రోజుల క్రితమే సిక్కిం డెమోక్రటిక్​ ఫ్రంట్​ (సీడీఎఫ్​) నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. సేమ్​ ఇటువంటి సీన్​ తెలంగాణలో కూడా జరగవచ్చన్న ప్రచారమూ జరుగుతోంది.

బీజేపీ చేతిలో అల్లావుద్దీన్​ అద్భుతదీపం ఉన్నట్టుంది. ఆ పార్టీ ఏమనుకుంటుందో అదే జరిగిపోతోంది. కాంగ్రెస్​ ముక్త్​ భారత్​ నినాదమిచ్చి.. దాదాపు కాంగ్రెస్​ను వాషౌట్​ చేసింది. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, పంజాబ్​తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో మాత్రమే కాంగ్రెస్​ అధికారంలో ఉంది. ఇందులో పుద్దుచ్చేరి మినహా మిగిలిన రాష్ట్రాలను బీజేపీ నుంచి కాంగ్రెస్​ గెలుచుకున్నదే. ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్​ ఢీ అంటే ఢీ అన్నట్టే ఉంటుంది కాబట్టి.. నెక్స్​ట్​ మళ్లీ బీజేపీకి అవకాశముంఉటుందనుకో.

కాంగ్రెస్​ ముక్త్​ భారత్​ నుంచి ఇప్పుడు ఆల్​ పార్టీ ముక్త్​ భారత్​ అన్న నినాదాన్ని బీజేపీ పట్టుకున్నట్టుంది. అందుకే ప్రాంతీయ పార్టీల పొతం పడుతోంది. కశ్మీర్​లో ఆర్టికల్​ 370, 35ఏ రద్దు చేయడంతో అక్కడి పార్టీలైన నేషనల్​ కాన్ఫరెన్స్​, పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీల అస్థిత్వంపై పెను ప్రభావం చూపింది. ఆ పార్టీలు కోలుకోవడం కొద్దిగా కష్టమే. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు జమ్మూకశ్మీర్​, లడఖ్​లో ఎన్నికలు జరుగుతాయని కూడా అనుకోలేని పరిస్థితి. రెండ్రోజుల క్రితమే.. సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రంట్​ పార్టీకి చెందిన 10 ఎమ్మెల్యేలు బీజేపీలోకి దూకేసి కండువాలు కప్పేసుకున్నారు. అక్కడ ఒక్కసీటు కూడా లేని బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైంది. రాబోయే రోజుల్లో అధికార పార్టీ అయే లక్షణాలు మాత్రం సూపర్​గా ఉన్నాయి. అంతకు ముందే సేమ్​సీన్​ గోవాలోజరిగింది. ఈ మధ్యే కర్ణాటకలో జేడీ(ఎస్​), కాంగ్రెస్​ సంకీర్ణ కూటమిని కుర్చీ మీదనుంచి దించి మరీ బీజేపీ అధికారంలోకి వచ్చింది.

ఇన్నాళ్లుగా కొరుకుడు పడని తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకొని మంచి ఊపుమీదుంది. ఇక్కడ టీడీపీలో మిగిలి ఉన్న నాయకత్వాన్ని లాగేసుకొని.. ఆ పార్టీని వాషౌట్​ చేసింది. ఇక అధికార పార్టీ టీఆర్​ఎస్​ మిగిలి ఉంది. ఆ పార్టీలో హరీశ్​రావు రూపంలో ఉన్న అసంతృప్తి లావాలా మరుగుతోంది. కానీ బయటకు పెల్లుబికడం లేదు. హరీశ్​రావుకు కేంద్రమంత్రి నితిన్​గడ్కరీకి మంచి సంబంధాలున్నాయి. అంతర్లీనంగా జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ కీలకమైన నేత రామ్​మాధవ్​ చర్చల మీద చర్చలు.. జరుపుతూనే ఉన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్​ ఈ మధ్యే చెప్పారు. టీఆర్​ఎస్లో​ ఏం జరిగినా.. ఆ పార్టీదే బాధ్యత మాది కాదనడంతో పాటు ఓ 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని చెప్పేశారు. వీళ్లతో పాటు కాంగ్రెస్​లో మిగిలిన కొందరిలో కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్​లోకి వచ్చేశారు. సో ఏదేమైనా.. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షమవుతుంది. అల్లావుద్దీన్​ అద్భుత దీపం వెలిగితే.. అధికారంలోకి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here