Home breaking news ఏపీ అసెంబ్లీలో *పోకిరి* డైలాగ్‌

ఏపీ అసెంబ్లీలో *పోకిరి* డైలాగ్‌

125
0
మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌

ఆ మ‌ధ్య మ‌హేశ్‌బాబు న‌టించిన పోకిరి సినిమా సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. రికార్డుల‌కు రికార్డు.. పేరుకు పేరు.. ఆదాయానికి ఆదాయం వ‌చ్చింది ఆ సినిమాకు. ఆ సినిమాలోని ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదు అన్న‌య్య.. బుల్లెట్ దిగిందా..? లేదా..? అన్న‌దే ముఖ్యం డైలాగ్ అప్ప‌ట్లో పేలిపోయింది. అది ఇప్ప‌టికీ స‌జీవంగానే ఉంద‌నుకో.

స‌రే ఇప్పుడీ డైలాగ్ ఎందుకనుకుంటున్నారా..? ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఈ డైలాగ్ పేలిపోయింది. ఈ డైలాగ్ విస‌ర‌డం ద్వారా టీడీపీకి పంచ్ వేశారు.. మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అధికార‌, విప‌క్షాల మ‌ధ్య వాడీ వేడిగా డైలాగ్‌లు.. ప్ర‌తి డైలాగ్‌లు పేల్చుకున్నారు.

వ‌డ్డీలేని రుణాల అంశంపై జ‌రిగిన చ‌ర్చ‌లో 2014-19 మ‌ధ్య‌.. ఒక్క‌రూపాయి కూడా రుణాల కోసం కేటాయించ‌లేద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌లో మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ పాల్గొని పంచ్ డైలాగ్‌ పేల్చారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు.. 40 ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటారు. కానీ అడిగిన ప్ర‌శ్న‌కు.. విసిరిన స‌వాల్‌ను మాత్రం స్వీక‌రించ‌రు. 40 ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అవ‌స‌రం లేదు. బుల్లెట్ దిగిందా..? లేదా..? అన్న‌దే ముఖ్యం అని డైలాగ్ పేల్చారు. ఇప్పుడు విప‌క్షానికి బుల్లెట్ దిగింది కాబ‌ట్టే స‌బ్జెక్ట్ నుంచి ప‌క్క‌కు పోతున్నారని యాద‌వ్ విమ‌ర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here