Home breaking news ఏంటీ నడ్డా పేరు కేటీఆర్ వినలేదా.? ఇక్కడ పూలగుచ్చం అందిస్తున్నదెవరో..!

ఏంటీ నడ్డా పేరు కేటీఆర్ వినలేదా.? ఇక్కడ పూలగుచ్చం అందిస్తున్నదెవరో..!

232
0
నడ్డాకు పూలగుచ్చం అందిస్తున్న కేటీఆర్​ (ఫైల్​ఫొటో నమస్తే తెలంగాణ నుంచి)

‘‘నేను నడ్డా పేరే వినలేదు. కానీ ఆయన మాటలు విన్న తరువాత అర్థమైందంటే.. ఆయన పేరు జేపీ నడ్డా కాదు.. అబద్ధాల అడ్డా’’ అని నిన్న టీఆర్​ఎస్​ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అనేశారు. ఆయన చేసిన  ఈ కామెంట్​ వినగానే.. నిజమే నడ్డా అనే పేరును కేటీఆర్​ వినక పోవచ్చు అని ఎక్కడో ఓ మూల అన్పించింది. తీరా కొన్ని పేపర్లు తిరగేస్తే అవి కూడా ఇతర పత్రికలు కాదు.. అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో తాటికాయంత అక్షరాలతో ‘రాష్ట్రంలో జాతీయ డ్రగ్​ కంట్రోల్​ అకాడమీ’ ఏర్పాటు చేయాలంటూ మంత్రి హోదాలో కేటీఆరే స్వయంగా నాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.. నేటి బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి పూల గుచ్చం అందించి మరీ కోరాడని పేర్కొంది. ఫొటోతో సహా మరీ కథనం ప్రచురించింది. ఈ వార్త నమస్తే తెలంగాణలో 28 జూన్​ 2016లో వచ్చింది. ఔరా ఏదితోస్తే అదే అంటే ఎలా..? ఇప్పుడు సోషల్​ మీడియా ఉంది. దొరికిపోతారు. ఇది 28 జూన్​ 2016లో నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. ఇప్పుడు అబద్థాలు ఆడుతున్నదెవరూ..?

IT Electronics & Communications Department

చిత్రమేమిటంటే.. నడ్డాతో కేటీఆర్​ సమావేశమైమన ఫొటోలు.. అప్పట్లో పైన పేర్కొన్న సైట్లో అప్​లోడ్​ చేశారు. తీరా ఇప్పుడు ఓపెన్​ చేస్తే మాత్రం కన్పించడం లేదు. కానీ సమాచారం మాత్రం ఉంది. ఇదిగో సమాచారం లింక్​ ఓపెన్​ చేయండి.

https://it.telangana.gov.in/minister-ktr-calls-on-union-ministers-in-new-delhi/

రాష్ట్రంలో జాతీయ డ్రగ్ కంట్రోల్ అకాడమీ

UPDATED : 6/28/2016 2:03:38 AM


న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: జాతీయస్థాయి డ్రగ్ కంట్రోల్ అకాడమీతోపాటు, ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని తెలంగాణలో నెలకొల్పాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేటీఆర్ సోమవారం నడ్డాతో భేటీ అయ్యారు. కేంద్ర జాతీయస్థాయిలో ఏర్పాటుచేయనున్న ఆ రెండు సంస్థలను తెలంగాణలో స్థాపించవలసిన ఆవశ్యకత గురించి కేటీఆర్ ఆయనకు వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ దేశంలోకెల్లా ఫార్మారంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ప్రాణాధార ఔషధాల్లో తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్న వాటి వాటా సుమారు 33% ఉన్నదని, నూతన ఔషధాల తయారీ, ఫార్ములాలు రూపొందించే సంస్థలు కూడా దేశంలో దాదాపు మూడింట ఒక వంతు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here