Home breaking news ఎస్పీ ఉచిత సలహా రాజకీయ పార్టీల మండిపాటు.. ఉలికిపాటు

ఎస్పీ ఉచిత సలహా రాజకీయ పార్టీల మండిపాటు.. ఉలికిపాటు

181
0

–ఆదిత్య

ఒక పోలీసాయన ఉచిత సలహా ఇచ్చేశారు. దీనిపై రాజకీయ పార్టీలు ఉలికిపడుతున్నాయి. అంత మాటంటరా..? అని మండిపడుతున్నాయి. కాంగ్రెస్​ యువరాణి ప్రియాంక  కూడా మండిపాటుకు అతీతురాలేమీ కాదు. ఇంతకీ విషయమేమిటంటే.. పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు జరిగిన సమయంలో కొందరు వ్యక్తులు పాకిస్థాన్​కు అనుకూలంగా నినాదాలు చేశారంట. దీంతో అక్కడే ఉన్న మీరట్​ ఎస్పీ అఖిలేశ్​ నారాయణ్​సింగ్​కు చిర్రెత్తినట్టుంది. పాకిస్థాన్​ అంత బాగుంటే ఇక్కడెందుకు అక్కడికే వెళ్లిపోండని కామెంట్​ చేశారు.  అయితే అక్కడ గొడవ జరిగింది ఈ నెల 20 తారీఖూ. ఎస్సీ మాట్లాడింది కూడా అదేరోజు. కానీ దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అంతే  పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చేస్తున్న వ్యక్తులు, పార్టీలు.. ఎస్సీ అలా కామెంట్​ చేస్తారా..? అంటూ మండిపడుతున్నాయి. దేశ ప్రజల మనసుల్లో మతం పేరుతో బీజేపీ విషం చిమ్ముతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కామెంట్​ చేసింది కాంగ్రెస్​ యువరాణి ప్రియాంక.

ఇదంత చూసి.. విన్న ఎస్పీ కూడా స్పందించి.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. ‘ ఈ నెల 20న మీరట్​లో పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన జరిగింది. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగానినాదాలు చేశారు. ఈ నిరసనలను అదుపు చేయడానికి నేను, కలెక్టర్​ అక్కడికి వచ్చాము. మేము రాగానే.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పాకిస్థాన్​కు అనుకూలంగా నినాదాలు చేశారు. మా వాళ్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. వాళ్లు వినలేదు. అందుకే ఇక్కడ ఉండి పొరుగు దేశాన్నిపొగుడుతారా.? పాకిస్థాన్​లోనే అంత బాగుందనుకుంటే.. అక్కడికే వెళ్లిపోండి. ’ అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అంతే లొల్లి మొదలైంది. సరే ఈ సంగతి పక్కన పెడదాం. భారత్​ కంటే పాకిస్థాన్​లో బాగుందా..? అన్న విష యానికొస్తే.. అక్కడ ఏం బాగాలేదన్న విషయం అందరికీ తెలుసు. అక్కడ ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో కూడా తెలుసు.  పాకిస్థాన్​ కంటే భారత్​లో 100 కు 100 శాతం బాగానే ఉంది. ఉంటుంది కూడా. అందుకే పాకిస్థాన్​ నుంచి భారత్​కు అక్రమంగా వలసలు పెరగడానికి కారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here