Home ఎడ్యుకేషనల్/జాబ్స్ ఎల్ఐసీలో 8581 ఉద్యోగాలు

ఎల్ఐసీలో 8581 ఉద్యోగాలు

108
0

హైద‌రాబాద్ః ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. దేశంలోని వివిధ జోన్ల ప‌రిధిలో 8581 అప్రెంటీస్ డెవ‌ల‌ఫ్‌మెంట్ (ఏడీవో) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటి భ‌ర్తీ కోసం అర్హులైన వారి నుంచి ద‌రఖాస్తుల‌ను కోరుతోంది.
జోన్ల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు
సౌత్ సెంట్ర‌ల్ జోన్ (హైద‌రాబాద్‌)-1251, వెస్ట‌ర్న్ జోన్ (ముంబాయి)- 1753
స‌ద‌ర‌న్ జోన్ (చెన్న‌య్‌)- 1257, నార్త్ సెంట్ర‌ల్ జోన్ (కాన్ఫూర్‌)-1042
నార్త‌ర్న్ జోన్ (ఢిల్లీ)-1130, ఈస్ట్ సెంట్ర‌ల్ జోన్ (పాట్నా)-701, ఈస్ట‌ర్న్ జోన్ (కోల్‌క‌తా)-922, సెంట్ర‌ల్ జోన్ (భోపాల్‌)-525 ఉద్యోగాల చొప్పున ఖాళీలున్నాయి.

అర్హ‌తః ఏదైన గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సుః 21 మే 2019 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి.
స‌డ‌లింపుః ఓబీసీల‌కు- మూడేళ్లు, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్ల చొప్పున వ‌య‌సు స‌డ‌లింపు ఉంటుంది. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ (www.licindia.in ) లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు రుసుంః ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ. 50, ఇత‌ర కేట‌గిరీల‌కు చెందిన వారికి రూ. 600 చొప్పున చెల్లించాలి.
చివ‌రి తేది: జూన్ 9, 2019.
ప్రిలిమినరీ పరీక్ష: 2019, జులై 6, 13 తేదీల్లో ఉంటుంది.
మెయిన్ పరీక్ష: ఆగస్టు 10, 2019

ఎంపికః ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్‌,మెయిన్స్‌), ఇంట‌ర్వూలుః మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక‌
ప్రిలిమిన‌రీ రాత ప‌రీక్ష‌లో రీజ‌నింగ్ ఎబిలిటీ- 35, న్యూమ‌రికల్ ఎబిలిటీ-35, ఇంగ్లిష్‌-30 ప్ర‌శ్న‌లుంటాయి. ఒక్కొ ప్ర‌శ్న‌కు ఒక మార్కు చొప్పున ఉంటుంది. 60 నిమిషాలు ప‌రీక్ష స‌మ‌యం ఉంటుంది. ప్రిమిలిన‌రిలో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులకు మెయిన్ ఎగ్జామ్‌కు అర్హులు.

మెయిన్ ఎగ్జామ్ః ఇందులో 150 మార్కులకు ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ-50, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్-50, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్-50 ప్రశ్నల చొప్పున‌ ఉంటాయి.
ఏజెంట్ కేట‌గిరికి సింగిల్‌ ఎగ్జామ్ 150 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో రీజ‌నింగ్ ఎబిలిటీ అండ్ న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ-10, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, క‌రెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లిష్ లాంగ్వెజ్-15, ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్సూరెన్స్/ప్రిన్సిపుల్స్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్సూరెన్స్ నుంచి 125 మార్కుల చొప్పున ప్ర‌శ్న‌లు ఉంటాయి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.licindia.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here