Home breaking news ఎన్​కౌంటర్​లో న్యూ డెమోక్రసీ నేత హతం – పోలీసులను రాళ్లతో కొట్టిన గిరిజనులు

ఎన్​కౌంటర్​లో న్యూ డెమోక్రసీ నేత హతం – పోలీసులను రాళ్లతో కొట్టిన గిరిజనులు

452
0
ఎన్​కౌంటర్​లో న్యూ డెమోక్రసీ నేత హతం- పోలీసులను రాళ్లతో కొట్టిన గిరిజనులు
ఫొటోలు: వీడియో నుంచి

బద్రాద్రి జిల్లాల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత లింగయ్య అలియాస్ లింగన్న హతమయ్యారు. ఆయనను ఎన్కౌంటర్ నిరసిస్తూ గిరిజనులు పోలీసులను వెంటబడి తరిమారు. అందిన సమాచారం ప్రకారం మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పోలీసులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గాలింపు  చర్యలు చేపట్టారు. ఈ సమయంలో గుండాల మండలంలోని అటవీ ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్​) న్యూ డెమోక్రసీ (రాయల) వర్గం ఎదురుపడింది. దీంతో రెండు వర్గాల వారు కాల్సులు జరుపుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో న్యూ డెమోక్రసీ నేత లింగన్న మృతి చెందగా మరో సభ్యుడు గాయపడ్డారు.

గాయపడిన వ్యక్తి అడవుల్లోకి పారిపోయినట్టుగా మిగిలిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లింగన్న ఎన్​కౌంటర్​ మరణించిన సమాచారం అందుకున్న గిరిజనులు అక్కడికి చేరుకొని కోపంతో పోలీసులపైకి దాడికి దిగారు. కర్రలతో కొడుతూ రాళ్లతో దాడికి దిగి వారిని వెంటబడి తరిమారు. పోలీసులపైకి గిరిజనులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న న్యూ డెమోక్రసీ సభ్యులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని డిమాండ్​ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఆయనతో పాటు దాదాపు 300 మంది కార్యకర్తలు, గ్రామస్థులు ఇల్లందు పట్టణంలో ఆందోళనకు దిగారు. దాదాపు 300 మంది పార్టీ కార్యకర్తలు, పోలీసులను చుట్టుముట్టారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here