Home breaking news ఎన్నికల పుట్టలో నోట్ల పాములు | Tamilnadu

ఎన్నికల పుట్టలో నోట్ల పాములు | Tamilnadu

87
0

ఎన్నికల పుట్టలో నోట్ల కట్టలు.. పాముల్లా బయటకు వస్తున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇదే పరిస్తితి.. కాకుంటే తమిళనాడులో ఎక్కువగా బయట పడుతోంది. ఇప్పటికే వెల్లూరు ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ మేనల్లుడు టీటివి దినకరన్ పార్టీ అమ్మ మక్కల్ మున్నెట్ర కగజం(ఏఎంఎంకె)కి చెందిన తాని జిల్లా అండిపట్టులోని ఒక దుకాణంపై ఐటి అధికారులు జరిపిన దాడిలో ₹ 1.48 కోట్ల నగదు బయట పడింది. అండిపట్టి అసెంబ్లీకి గురువారం పోలింగ్ జరుగనుంది. దీంతో ఓటర్లకు పంపిణీ చేయాలని డబ్బు తెప్పించిన పార్టీ నేతలు దుకాణంలో ఉంచారు. సమాచారాన్ని అందుకున్న ఎన్నికల కమిషన్, ఐటీ బుధవారం తెల్లవారుజామునే దాడులు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు కవర్లు తెప్పించడంతో పాటు ఒక్కో కవర్ లో ₹ 300 చొప్పున పెట్టారు. కవర్లపై ఓటరు గుర్తింపు నంబర్లు కూడా వేసి ఉంచారు. ఏఎంఎంకే అభ్యర్ది నమూనా బ్యాలెట్ పేపర్లు కూడా కవర్లలో ఉన్న విషయాన్ని గుర్తించారు.

ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. వార్డు నంబర్లు, ఓటర్ల సంఖ్యలు రాసివున్న కవర్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 300 చొప్పున నగదు ఉంచినట్టు గుర్తించారు. అంతేకాదు ఏఎంఎంకే అభ్యర్థికి టిక్‌ పెట్టిన పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐటి అధికారులను అడ్డుకోవడానికి ఏ ఎంఎంకే కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. కాగా లోక్ సభ రెండో దశ ఎన్నికలు గురువారం తమిళనాడులోని 39 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే వెల్లూరు స్థానానికి సంబంధించి ₹ 11.58 కోట్లు పట్టుబడడంతో ఎన్నిక వాయిదా పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here