Home ఎడ్యుకేషనల్/జాబ్స్ ఎన్ఐఓఎస్‌(NIOS)లో మే 20 వ‌ర‌కూ అడ్మీష‌న్స్‌

ఎన్ఐఓఎస్‌(NIOS)లో మే 20 వ‌ర‌కూ అడ్మీష‌న్స్‌

79
0

హైద‌రాబద్ః తెలంగాణ లో ఇంటర్ మీడియట్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థినీ విద్యార్థుల కోసం రాష్ట్రం లో మే నెల 20వ తేదీ నుండి మే నెల 31వ తేదీ వరకు ఒక ‘స్పెష‌ల్ ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్’ లను నిర్వహించడానికి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఒఎస్) ముందుకు వచ్చింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అదనంగా ఈ పరీక్ష లను రాసే వీలు విద్యార్థులకు ఉంది. ఇంటర్ పరీక్షలు రాసిన వారి లో మూడు లక్షల మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదు. పరీక్షలో తప్పినందుకు ఇరవై మందికి పైగా విద్యార్థినీ విద్యార్థుల మనస్తాపం తో ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని తాము మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహిస్తున్నామ‌ని ఎన్ఐఒఎస్ ప్రాంతీయ డైరెక్టర్ అనిల్ కుమార్ రోటె తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 20 నుంచి 31 వ‌ర‌కూ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ పరీక్షలను రాయడం కోసం ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, విద్యార్థుల పేర్ల నమోదు కు గడువును ఈ నెల 20 వరకు పొడిగించామ‌ని చెప్పారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు తాము ఉత్తీర్ణులు అయిన రెండు సబ్జెక్టుల మార్కులను బదిలీ చేసుకొని (ట్రాన్స్ ఫర్ ఆఫ్ క్రెడిట్), మూడు సబ్జెక్టుల పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఫ‌లితాల‌ను నెల రోజు్ల్లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మూడు సబ్జెక్టులు పాస్ అయిన విద్యార్థికి 5 సబ్జెక్టులతో కూడిన మార్క్ షీట్ ఇవ్వబడుతుంద‌ని చెప్పారు. ఈ మార్క్ షీట్ లో ఎలాంటి చుక్క గుర్తు (యాస్టరిస్క్), కంపార్ట్ మెంట్ లేదా సప్లిమెంటరీ అని రాసి ఉండదని తెలిపారు. స్పెష‌ల్‌ ఆన్ డిమాండ్ పరీక్షలో నమోదు చేసుకోవడానికి ఎన్ఐఒఎస్ వెబ్ సైట్ www.nios.ac.in, https://sdmis.nios.ac.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివ‌రాల‌కు ఎన్ఐఒఎస్ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయాన్ని 040-24752859, 24750712 అనే ఫోన్ నంబర్ లలో సంప్రదించాల‌ని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here