Home కామెడి ఎంత చమత్కారమో.. షాంపు యాడ్స్​లో ఉల్లిగడ్డ దర్శనం

ఎంత చమత్కారమో.. షాంపు యాడ్స్​లో ఉల్లిగడ్డ దర్శనం

207
0

–వికాస్​ రుషి

చిన్నప్పుడు.. బడి ఎగ్గొట్టాలంటే.. ఒకటే సూత్రం. చంకలో ఉల్లిగడ్డ పెట్టుకోవడం. ఉల్లిగడ్డ పెట్టుకుంటే శరీరం వేడిగవుతుంది.  చంకలో ధర్మామీటర్​ పెడితే.. టెంపరేచర్​ చూపించి.. జ్వరం వచ్చిందని చెప్పేదీ. అలాంటి చమత్కారాలు చేసేటోళ్లు. ఇప్పుడు ఉల్లిగడ్డ ధర పెరిగిందిగా.. ఎన్ని జోకులో..! ఆఖరికి కొందరు ఉల్లిగడ్డలు కూడా దొంగతనం చేసేకాడికి వచ్చింది. ఈ దొంగతనం చేసినోడు.. వేరే దొంగతనాలు చేశాడో..? చేసినప్పుడు దొరికాడో లేదో తెలీదు కానీ ఉల్లిగడ్డలు దొంగతనం చేసిన వాళ్లలో ఒకడు సూర్యాపేటలో దొరికాడులే పాపం. ఆని ఖర్మ అట్ల తెంచిది ఈ ఉల్లిగడ్డ. సరే ఈ సంగతి పక్కన పెడదాం అసలు ఉల్లిగడ్డ ముచ్చట ఎందుకొచ్చిందంటే.. అన్ని వస్తువులపై యాడ్స్​ కన్పించినా.. ఉల్లిగడ్డపై మాత్రం యాడ్స్​ కన్పించిన సందర్భాలు మాత్రం లేవు.

ధర పెరిగిందిగా.. అందుకే ఈ మధ్య యాడ్స్​లో కూడా ఉల్లిగడ్డను వాడుకుంటున్నారు.   ఇప్పటివరకూ  ఒకడేమో.. మీ టూత్​ పేస్టులో ఉప్పుందా..? అంటూ ప్రశ్నిస్తూ యాడ్స్​ వేస్తాడు. ఇంకోడు లవంగం ఉందా..? అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అటువంటోళ్లది మీరా షాంపోళ్లు తొక్కినట్టున్నడు. మా షాంపుకు ఎవరి షాంపు పోటీ కాదు. కాబోదు. మేము చేసినట్టు ఎవరూ  చేయరని అనుకున్నట్టున్నడు. అందుకే మా షాంపులో ఉల్లి ఉంది అని అంటున్నడు. మా షాంపు వాడితే చుండ్రు పోతదని ఈ యాడ్​ సారాంశం.  ఇప్పటివరకూ చుండ్రు పోవడానికి ఎన్నెన్నో మాటలు షాంపుల కంపెనోళ్లు చెప్పారుగా. ఎవడూ చెప్పినా.. చుండ్రు మాత్రం పోతలేదు. జనాల జేబులకు పొక్కలు పడి పైసలు పోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ ధర పెరిగిందిగా.. అందుకే ఈయాడ్​ చేసినట్టున్నరు. ధర తగ్గిందంటే.. ఈ యాడ్​ కన్పిస్తదా..? చూద్దాం.  ఏదీ ఏమైనా కొనేవాడంటే..అమ్మేటోడికి లోకువే. అమ్మేటోడంటే.. కొనటోడికి మాత్రం గౌరవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here