Home తాజా వార్తలు ఊరంతా ఒక‌దారి.. / Variety politics in Telugu states

ఊరంతా ఒక‌దారి.. / Variety politics in Telugu states

124
0

ఊరంతా ఒక‌దారి, ఉలిపిరి క‌ట్టె (లు) ఇంకోదారి అని పెద్ద‌లు చెప్పిన‌ట్టుగా ఉంది. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం. దేశ వ్యాప్తంగా పుల్వామా ఉగ్ర‌దావి, స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌, వైమానిక దాడులు, ఫైల‌ట్ అభినంద‌న్ విడుద‌ల‌.. ఇవ‌న్నీ కంటికి క‌న్పిస్తున్నా.. నిజ‌మేనా..? అని కాంగ్రెస్ స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. త్రివిధ ద‌ళాలు, వైమానిక ద‌ళాధిప‌తి వ‌చ్చి.. నిజ‌మేన‌ని చెబుతున్నా.. విదేశీ ప‌త్రిక‌లు రాస్తున్నాయి.. స‌మాధానం చెప్పాల్సిందే అని మ‌రీ గుచ్చి గుచ్చి నిల‌దీస్తున్నాయి. వీటిపై ఇప్పుడు దేశంలో చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోకి వ‌చ్చే సరికీ సీన్ మారిపోయింది. మ‌నం మొద‌ట చెప్పుకున్న‌ట్టుగా ఊరంతా ఒక‌దారి ఉలిపిరి క‌ట్టె మ‌రోదారి అన్న‌ట్టుగా ఉంది. దేశంలో ఉగ్ర‌వాదంపై చ‌ర్చోపచ‌ర్చ‌లు జ‌రుగుతుంటే.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి.. డేటా స్కామ్‌, ఐటీ గ్రిడ్ వంటి అంశాలు తెర‌పైకి వ‌చ్చాయి.

తెలంగాణ‌..
ఐదో ఎమ్మెల్సీనీ గెలిపించుకోవ‌డానికి ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యేను టీఆర్ఎస్ త‌న పార్టీలోకి ఆహ్వానించింది. ఛ‌త్ అదేమీ కాద‌ని టీఆర్ఎస్ చెబుతుంద‌నుకోండి అది వేరే విష‌యం. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కోసం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డానికి వెళ్తున్నామ‌ని చెప్ప‌డం కూడా వేరే విష‌య‌మే. ఏతా వాత చెప్పేదేమిటంటే.. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు. టీఆర్ఎస్ 4+1 ఎమ్మెల్పీలు గెలువ‌నుంది. ఫిరాయింపులుపై స‌వాళ్లు.. ప్ర‌తి స‌వాళ్లు.. మీరిలా చేశారంటే… మీరిలా చేశారంటూ ఒక‌టే ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు.. మెత్తానికి రాజ‌కీయ వేడి పెరిగిపోయింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..
డేటా స్కామ్ పై ఐటీ గ్రిడ్ సంస్థ‌పై ఫిర్యాదులు.. హైద‌రాబాద్ లోని ఆ సంస్థ కార్యాల‌యంలో తెలంగాణ పోలీసుల సోదాలు. డేటా స్కామ్ జ‌రిగింద‌నే తెలంగాణ పోలీసులు అంటున్నారు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అయితే కారాలు మిరియాలు నూరుతున్నారు. మా ఆత్మ‌గౌరవం దెబ్బ‌తీస్తారా.? అంటున్నారు. ఫిర్యాదు వ‌చ్చింది సోదాలు చేశారు. దీనికి ఆత్మ‌గౌర‌వానికి సంబంధ‌మేమిటో ప్ర‌జ‌లకు కూడా అర్థం కావ‌డం లేదు. త‌ప్పేం చేయ‌న‌ప్పుడు నీకు ఉలుకెందుక‌య్యా అంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కుమారుడు కేటీఆర్ అంటున్నారు. స‌రే మొత్తానికి చంద్ర‌బాబు మాత్రం ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు రెండు అస్త్రాలు దొరికాయ‌ని సంబ‌రప‌డుతుండొచ్చు. దేశంలో ప్ర‌జాస్వామ్యం అంటూ మోదీని విమ‌ర్శించ‌డానికి బాలాకోట్ దాడులు, డేటా స్కామ్‌పై తెలంగాణ పోలీసుల సోదాలతో ఆంధ్ర‌ప్ర‌జ‌ల ఆత్మ‌గౌరవం దొరికింది. ఈ రెండు తెప్ప‌లు ప‌ట్టుకొని ఎన్నిక‌ల గోదావ‌రిని ఈద‌డానికి చంద్ర‌బాబు ఉత్సాహంగా ముందుకొస్తుండు. ఈ తెప్ప‌లు బాబును ద‌రికి చేరుస్తాయా..? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here