Home breaking news ఉప ఎన్నికల్లో తోక కూడా అవసరమే.. అది ఉంటేనే సంపూర్ణం

ఉప ఎన్నికల్లో తోక కూడా అవసరమే.. అది ఉంటేనే సంపూర్ణం

91
0

కమ్యూనిస్టులు తోకలు.. ఇదే మాట గతంలో సీఎం కేసీఆర్​ చెప్పారు. అప్పుడు ఆయన పేర్కొన్న తోకల్లోని ఒక తోక సీపీఐని మద్దతీయాలని సీఎం కోరారు. సీపీఐ కూడా మహదానందంగా ఒప్పుకున్నది. హుజూర్​నగర్​ ఉప ఎన్నిక గెలుపు టీఆర్​ఎస్​కు అత్యవసరం. ఇక్కడ గెలిస్తేనే.. రేపటి మునిసిపాలిటీ ఎన్నికలకు ఏనుగంత బలం వస్తుంది. అందుకే అక్కడ 700 మందిని మోహరించారు. అయినా తక్కువే అన్న ఉద్దేశంతో.. గతంలో తాను తోకగా అభివర్ణించిన సీపీఐని మద్దతు కోరారు. వాడుకోవడంలో కేసీఆర్​ను మించిన వారు మరొకరు మనకు కన్పించరు. వరుసగా కమ్యూనిస్టులను ఒకసారి కాంగ్రెస్​, మరోసారి టీడీపీతో కలిసి వాడుకున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తాను కూడా సీపీఐని ఎంత వాడుకోవాలో.. అంతకంటే ఎక్కువే వాడుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా కేసీఆర్​ గెలిచారు. సీపీఐ నారాయణ అదే చికెన్​ నారాయణను చెవులు కోసుకోమ్మని ఉచిత సలహా ఇచ్చేశారు. తోకలని ఇంకేదో అని చెప్పేశారు. రాష్ట్రం ఏర్పడగానే.. సీపీఐ మన తెలంగాణ పేరుతో ఒక పత్రికను తీసుకొచ్చింది. దీనికి విశాలాంధ్రకు ఇచ్చినట్టుగానే.. యాడ్స్​ ఇస్తామని చెప్పారు. ఇవ్వలేదు. దీంతో ఏకంగా ఆ పత్రికే వేరే వాళ్లకు ఇచ్చేశారు. ఇప్పుడు ప్రజాపక్షం పేరుతో మరో పత్రికను నడుపుతోంది. పైగా గత అసెంబ్లీలో సీపీఐకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ను టీఆర్​ఎస్​లోకి లాక్కున్నారు. అప్పుడైతే సీపీఐ నానా రచ్చ చేసింది. అన్ని మాటలని ఉన్న ఏకైక ఎమ్మెల్యేను లాక్కున్నా.. మద్దతు కోసం కేసీఆర్​ తన దూతను పంపగానే.. సీపీఐ మహదానందంగా ఒప్పేసుకున్నది. కాకుంటే శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది కాబట్టి.. రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కమిటీ సమావేశం జరిగింది. టీఆర్​ఎస్​కు మద్దతిస్తున్నామని, ప్రచారం చేస్తామని కూడా ప్రకటించింది.

తోక అంటూ ఈసడించినట్టు మాట్లాడినా.. మద్దతీయడంలో మర్మాలు అనేకమున్నాయన్న ప్రచారం జరుగుతోంది. సీపీఐ సొంత పత్రిక ప్రజాపక్షంకు సర్కారు ప్రకటనలు రావడం లేదు. అది సంక్షోభంలో కూరుకొని పోయింది. జీతాలు ఇవ్వడమే గగనంగా మారింది. ఇవి కాకుండా టీవీ 99 చానల్​ కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది. పైగా విజయవాడలోని పార్టీకి చెందిన ఒక బిల్డింగ్​ను బ్యాంకుకు కుదువ పెట్టారు. ఇవి కాకుండా అనేక సమస్యలు అనేకమున్నాయని తోటి కమ్యూనిస్టు పార్టీలు చెబుతున్నాయి. ఇందులో నిజం కూడా ఉంది. అందుకే అంటారు వ్రతం చెడ్డా ఫలితం దక్కాలని. అయితే ఇక్కడ సీపీఐ వ్రతం చెడింది. కానీ ఫలితం దక్కుతుందా..? ఎన్నికలు ఐపోగానే కేసీఆర్​ తూచ్​ అంటారా..? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here