Home breaking news ఉగ్ర భూతం దాడి- 140 మంది మృతి

ఉగ్ర భూతం దాడి- 140 మంది మృతి

148
0

ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడుస్తున్న ఉగ్ర‌భూతం తాజాగా శ్రీలంక‌పై దాడి చేసింది. 140 మందిని బ‌లి తీసుకుంది. క్రైస్త‌వుల‌ను లక్ష్యంగా చేసుకొని నిర్వ‌హించిన ఈ దాడిని భార‌త్ ఖండించింది. శుక్ర‌వారం గుడ్ ఫ్రైడే ముగిసింది. ఆదివారం ఈస్ట‌ర్ పండుగ‌. ఈ సందర్భంగా చ‌ర్చిల‌కు క్రైస్త‌వులు పోటెత్తుతారు. వీరిని ల‌క్ష్యంగా చేసుకొని ఉగ్ర‌భూతం త‌న పంజా విసిరింది. వ‌రుస బాంబు పేలుళ్ల‌కు దిగింది. కొలంబోలోని కొచ్ చికాడోలోని సెయింట్ అంథోని, క‌థువ‌పితియాలోని క‌టానా చ‌ర్చిలో చోటు చేసుకున్న‌ ఈ పేలుళ్ల కార‌ణంగా 140 మంది మృతి చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశ‌ముంది. 300 మందికి పైగా గాయాల‌య్యాయ‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఉగ్ర‌దాడితో శ్రీలంక ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించింది. అదే విధంగా షాంగ్రిలా హోటల్‌, కింగ్స్‌బ‌రి హోట‌ల్‌లో కూడా బాంబులు పేలాయి. ఈ ఉగ్ర‌దాడితో అప్ర‌మ‌త్త‌మైన భార‌త విదేశాంగ శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. కొలంబోలోని భార‌త హై క‌మిష‌న‌ర్‌తో సంప్ర‌దింపులు జరుపుతున్నామ‌ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్ర‌క‌టించారు. దేశ ప్రజలు సంయమనం పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పిలుపునిచ్చారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఖండించారు. ప్రజలందరూ సమైక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వదంతులను నమ్మవద్దని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here