Home breaking news ఉగ్ర‌వాదాన్ని ఐక్యంగా ఎదుర్కుందాం- శ్రీలంక‌లో ప్ర‌ధాని మోదీ

ఉగ్ర‌వాదాన్ని ఐక్యంగా ఎదుర్కుందాం- శ్రీలంక‌లో ప్ర‌ధాని మోదీ

229
0
కొలంబోలోని భార‌త సంత‌తిని ఉద్దేశించి మాట్లాడుతున్న‌ మోదీ.

న్యూఢిల్లీః ఉగ్ర‌వాదాన్ని ఐక్యంగా ఎదుర్కుందామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అన్నారు. ఉగ్ర‌వాదం ఉమ్మ‌డి శ‌త్రువని.. ఎదుర్కోవ‌డానికి నిర్ధిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందించుకుందామ‌ని చెప్పారు. ఇటీవ‌లే.. శ్రీలంక‌లో ఈస్ట‌ర్ పండుగ రోజు.. చ‌ర్చీల‌పై ఉగ్ర‌వాదాలు జ‌రిపిన దాడిలో వంద‌లాది మంది మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఉగ్ర‌బాధితురాలైన శ్రీలంకకు సంఘీభావం తెల‌ప‌డానికి మోదీ శ్రీలంక‌లో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా అధ్య‌క్షుడు మైత్రిపాల‌ సిరిసేన‌తో క‌లిసి బాంబుదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. పిరికిపంద‌ల్లా ఉగ్ర‌వాదులు వ్య‌వ‌హ‌రించార‌ని, వారి చ‌ర్య కార‌ణంగా శ్రీలంక‌ స్థైర్యం దెబ్బ‌తిన‌ద‌ని వ్యాఖ్యానించారు. శ్రీలంకు భార‌త్ తోడుగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. శ్రీలంక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ద్వైపాక్షిక‌, ఇరుదేశాల ఉమ్మ‌డి ప్రాధాన్యాల గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం శ్రీలంక అధ్య‌క్షుడు సిరిసేన‌, ప్ర‌ధాని మోదీకి విందు ఇచ్చారు. ధ్యాన‌ముద్ర‌లో ఉన్న బుద్ధుని ప్ర‌తిమ‌ను సిరిసేన బ‌హుక‌రించారు. శ్రీలంక భ‌ద్ర‌త‌, భ‌విష్య‌త్‌లో భార‌త్ భాగ‌స్వామిగా ఉంటుంద‌ని ప్ర‌ధాని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

మోదీకి గొడుగు ప‌ట్టిన సిరిసేన‌
శ్రీలంక‌లో ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో.. వ‌ర్షం ప్రారంభ‌మైంది. దీంతో ప‌క్క‌నే ఉన్న ఆ దేశ అధ్య‌క్షుడు సిరిసేన.. మోదీకి గొడుగు ప‌ట్టారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కొలంబోలోని భార‌త సంత‌తిని ఉద్దేశించి మోదీ మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here