Home breaking news ఉగ్ర‌వాదంపై యుద్ధ‌మే- త్రివిధ‌ ద‌ళాలు

ఉగ్ర‌వాదంపై యుద్ధ‌మే- త్రివిధ‌ ద‌ళాలు

151
0

పాకిస్థాన్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఉగ్ర‌వాదంపై యుద్ధం కొన‌సాగిస్తామ‌ని త్రివిధ ద‌ళాలు స్ప‌ష్టం చేశాయి. భారత త్రివిధ దళాలు గురువారం సాయంత్రం సంయుక్తంగా సమావేశమై భారత్, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సంద‌ర్భంగా పాకిస్థాన్ దుర్నీతిని ఎండ‌గ‌ట్టాయి. మ‌న వాయిసేన ఉగ్ర‌వాద శిబిరాల‌పై దాడులు చేస్తే.. పాకిస్థాన్ మాత్రం మ‌న దేశ‌ సైనిక స్థావరాలపై బాంబులు వేశాయ‌ని ఆరోపించాయి. అయితే వాయుసేన వేగంగా స్పందించి వాటిని తిప్పికొట్టింద‌ని తెలిపాయి. పాకిస్థాన్ చేసిన విమాన దాడుల‌ను వివ‌రించారు. *ఫిబ్రవరి 27న ఉ.10 గంటలకు పాక్‌ విమానాలు చొరబడడాన్ని గమనించాము. ఆ వెంటనే వైమానిక దళం స్పందించింది. మిగ్‌ 21, సుఖోయ్‌, మిరాజ్‌ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లి పాక్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని కూల్చేశాము. ఈ విమానం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోయింది. ఈ ప్ర‌తిదాడుల కార‌ణంగా ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన మిగ్‌-21ను కోల్పోయాము. అయితే పాకిస్థాన్‌కు చెందిన రెండు విమానాలను కూల్చి వేశామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో పాకిస్థాన్‌ అనేక అబద్ధాలు ఆడిందని, ఇద్దరు పైలట్లు తమ ఆధీనంలో ఉన్నారని తప్పుడు సమాచారం ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చింద‌ని పేర్కొన్నాయి. పైగా ఎఫ్‌-16 విమానాలు వాడలేదంటూ కట్టుకథలు చెప్పింద‌న్నారు. అయితే ఎఫ్‌-16 విమానాలు వాడిందనడాకి కావాల్సిన ఆధారాలు ఉన్నాయ‌ని, పాక్‌ ఉపయోగించిన విమాన శకలాలను త్రివిధ ద‌ళాలు మీడియాకు చూపించాయి. పాకిస్థాన్ ఎలాంటి దాడుల‌కు దిగిన ఎదుర్కుంటామ‌ని స్ప‌ష్టం చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here