Home breaking news ఈ ‘లవ్’కిక్​వాదులేమయ్యారు ..? బైంసాపై ఎందుకు మాట్లాడరు.?

ఈ ‘లవ్’కిక్​వాదులేమయ్యారు ..? బైంసాపై ఎందుకు మాట్లాడరు.?

779
0

–ఆదిత్య

రెండు రోజులుగా నిర్మల్​ జిల్లా (ఆదిలాబాద్​) బైంసాలో విధ్వంసక ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఘటనలపై ‘లవ్​’కికవాదులమంటూ గొంతు చించుకునే వారు కనీసం మాటైనా మాట్లాడడం లేదు. చిన్న స్టేట్​మెంట్​ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఘటనలకు ఈ ‘లవ్​’కికవాదులు సమర్థించే వారే కారణం కాబట్టి. బైక్​ సైలెన్సర్​ తీసేసి ఇళ్ల ముందు నడిపించాడు ఒకడు. ఇదేం పనయ్యా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు ఇంకొకడు. ఇది ఈ లవ్​కికవాదులు సమర్థించేవాళ్లకు నచ్చలేదు. అంతే మందిమార్బలాన్ని తీసుకొచ్చాడు. ఇండ్లపై దాడికి దిగి ఒక ఇల్లును కాల్చివేశారు. 18 ఇండ్లను ధ్వంసం చేసేశారు. ఇండ్ల ముందున్న బైక్​లను సైకిళ్లను కంటికి ఏది కన్పిస్తే దానిని తగులబెట్టారు.పోలీసులను కొట్టారు. చివరకు 144 సెక్షన్​ విధించారు.

బైంసాలోని విధ్వంసక దృశ్యాలు

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఎంటంటే.. బైంసా జనాభాలో ఈ లవ్​కికవాదులకు నచ్చే వారి జనాభా 80 శాతం. వీరికి నచ్చని జనాభా 20 శాతమే. మైనార్టీలు మైనార్టీలూ అని గొంతు చించుకునే వీళ్లు ఇక్కడ మైనార్టీలు ఎవరో కనబడడం లేదా..? వీళ్ల పక్షాన ఎందుకు మాట్లాడరు. మాట్లాడితే.. తమ లవ్​కికవాద ముద్ర చెరిగిపోతుందన్న భయమా.? అంతే అయిఉండవచ్చు. ఇప్పటికే వీళ్లకు జనం.. దూరమై పోయారు. కాకుంటే వీళ్ల లవ్​కికవాదుల్లో కొందరు ఇంకా మీడియాలో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. చేతిలో మీడియా సంస్థలున్నాయి. అందుకే వీరికి మీడియాలో లవ్​కికవాదులుగా  ఆదరణ లభిస్తోంది. ఇంకో చిత్రమైన విషయమేమిటంటే..  కమ్యూనిస్టుల్లోని ఒక‘ తెగ’ లవ్​కికవాద పార్టీ ఒకసారి తమ రాష్ట్ర కార్యాలయంలో కేక్​ కట్​ చేసి ఒక పండుగ  వేడుకలు జరిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here