Home breaking news ఈటల పేరుతో ప్రకటన.. కర్త.. కర్మ.. క్రియ… మాత్రం ఆయన కాదు

ఈటల పేరుతో ప్రకటన.. కర్త.. కర్మ.. క్రియ… మాత్రం ఆయన కాదు

441
0

ఈటల్లాంటి మాటలు విసిరిన మంత్రి ఈటల రాజేందర్​ ఆ వెంటనే ఒక స్టేట్​మెంట్​ విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశమేమిటంటే.. తాము టీఆర్​ఎస్​కు ఓనర్లమంటూ, మధ్యలో వచ్చిన వారం కాదంటూ, ఒక పత్రికను పట్టుకొని బిడ్డా అంటూ మధ్యాహ్నాం తాను చేసిన స్టేట్​మెంట్​ను గుర్తు చేస్తూ ఆ స్టేట్​మెంట్​లో రంద్రాన్వేషణ చేయవద్దని. మధ్యాహ్నం ఈటల చేసిన గరం గరం స్టేట్​మెంట్​ విన్నవాళ్లంత రెండో స్టేట్​మెంట్​ చూసి కొద్దిగా తికమక పడిపోయారు. ఈటల మాటలు విన్న సీఎం కేసీఆర్​.. బుజ్జగించి ఉంటారు. అందుకే ప్రకటన వచ్చిందని అందరూ అనుకున్నారు. అసలు కథేమిటంటే..  అసలా స్టేట్​మెంట్​ ఈటల రాజేందర్​ ఇవ్వలేదు. ఈ విషయాన్ని స్టేట్​​ మీడియా గుర్తించింది. కాకుంటే.. ఇప్పుడు టీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా ఎవరూ రాయడం లేదు కాబట్టి.. ఇది కూడా ఈటల రాజేందర్​ చేసిన ప్రకటనగానే భావించినట్టుగా అనుకొని పాజిటీవ్​గానే రాశారు.

హుజురాబాద్​లో ఈటల చేసిన కామెంట్స్​ టీఆర్​ఎస్​లో ఒకరకంగా పెనుతుఫాన్​నే సృష్టించాయి. ఏనాడు ఎలాంటి కామెంట్​ చేయని ఈటల.. ఈ రకంగా మాట్లాడడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. చర్చల మీద చర్చలు సాగుతున్నాయి. దీన్ని వెంటనే సరిదిద్దాలని టీఆర్​ఎస్​ అతి ముఖ్యులు భావించి ఈటలతోనే ఒక స్టేట్​మెంట్​ ఇప్పించాలని భావించారు. కానీ ఆయన ఇస్తాడా..? అన్న ఒక చిన్న అనుమానం. తాము అడిగిన తరువాత స్టేట్​మెంట్​ ఇవ్వకుంటే. దీనిపై చర్చోపచర్చలు జరిపారు. చివరకు తామే ఒక స్టేట్​మెంట్​ రెడీ చేసి.. మేము పంపించిన ఈ స్టేట్​మెంట్​ను మీడియాకు విడుదల చేయండని సమాచారం అందించారట.

ఈ సమాచారం అందుకున్న ఈటల… జరగాల్సింది జరిగిపోయింది. తాను చెప్పదలుచుకున్నది చెప్పేశాను. స్టేజీమీద ఇచ్చిన మొదటి స్టేట్​మెంట్​కున్న డిమాండ్​ సవరణ స్టేట్​మెంట్​కు ఉండదని ఈటల అనుకొని ఉంటారు. అందుకే టీఆర్​ఎస్​ ముఖ్యమైన ప్లేస్​ విడుదల చేసిన స్టేట్​మెంట్​ను విడుదల చేశారు. మొదటి స్టేట్​మెంట్​కున్న డిమాండ్​.. సవరణ స్టేట్​మెంట్​కు ఎలాగు ఉండదు కదా. ఎంత కష్టంగా సవరణ స్టేట్​మెంట్​ తయారు చేసినా.. జరగాల్సి మాత్రం జరిగిపోయింది. టీఆర్​ఎస్​లో ఏదో జరిగిపోతోందని మాత్రం జనాలకు తెలిసిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here