Home breaking news ఇస్మార్ట్ శంకర్ చేతులెత్తేశాడు- అక్కడ మాత్రం సక్సెస్ ఫుల్ గా దెబ్బ

ఇస్మార్ట్ శంకర్ చేతులెత్తేశాడు- అక్కడ మాత్రం సక్సెస్ ఫుల్ గా దెబ్బ

131
0

ఇస్మార్ట్ శంకర్ ఇక్కడ వసూళ్ల రాజు అయితే.. అక్కడ కూడా కావాలని రూల్ ఉందా. ఇస్మార్ట్ శంకర్ కూడా అంతే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయింది. కలెక్షన్లు కురిపిస్తోంది. హిట్.. సూపర్ హిట్ అనేస్తున్నారు. అక్కడ మాత్రం వసూళ్లలో వెనుకబడి నీరసంగా అయిపోయాడట. ఏందీ గోల ఇక్కడ హిట్.. అక్కడ కాదంటారేంటి అని కన్ఫ్యూజన్ అవుతున్నారా..? అదే.. ఓవర్సీస్ లో మహేశ్ బాబు మహర్షి లా ఇస్మార్ట్ శంకర్ కూడా కలెక్షన్లు రాబట్టడంలో వీక్ అయిపోయాడంట. మన ఇస్మార్ట్ శంకర్ విదేశాల్లో చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు చేయడం లేదు. ఇక్క‌డ భారీ వ‌సూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న ఇస్మార్ట్ శంక‌ర్.. విదేశాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువలో ఎక్కువ 2 ల‌క్ష‌ల డాల‌ర్లు కూడా వసూళ్లు చేయలేదట. ఇక్కడ నచ్చినంత మాత్రాన విదేశీ ప్రేక్షకులకు నచ్చాలని రూలుందా. మొత్తానికి శంకర్ ఇక్కడ మాత్రమే ఇస్మార్ట్ సుమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here