Home breaking news ‘ఇస్మార్ట్​ శంకర్​’ వివాదం ‌‌కాన్సెప్ట్​ నాదే అంటున్న ఆకాశ్​

‘ఇస్మార్ట్​ శంకర్​’ వివాదం ‌‌కాన్సెప్ట్​ నాదే అంటున్న ఆకాశ్​

203
0
ఇస్మార్ట్​ శంకర్​ వివాదం ‌‌కాన్సెప్ట్​ నాదే అంటున్న ఆకాశ్​
ఇస్మార్ట్​ శంకర్​

విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ఇస్మార్ట్​ శంకర్​’ వివాదాల్లో చిక్కుకుంది. ఆ సినిమా కాన్సెప్ట్​ నాదే అంటున్నారు.. ‘ఆనందం’ ఫేమ్​ ఆకాశ్​. ఇస్మార్ట్​ శంకర్​ సినిమాలో ఒకరి మెదడు మరొకరికి మార్పడి చేయడమన్న కాన్సెప్ట్​ తెలుగు ప్రేక్షకులకు నచ్చింది. దీంతో సినిమా విజయవంతంగా నడుస్తోంది. ఇదే కాన్పెప్ట్​తో తాను రాసిన కథ, కథనంతో మహిళా దర్శకురాలు రాధ తమిళంలో ‘నాన్​ యార్​’ తీశారని, ఈ సినిమాలో తానే కథానాయకుడిని అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సినిమాను తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్​ త్వరలో విడుదల చేస్తున్నామని తెలిపారు.

తాము విడుదల చేయబోయే సినిమా కథనే ఇస్మార్ట్​ శంకర్​ పోలి ఉండడం తనకు షాక్​ తగిలిందని అంటున్నారు ఆకాశ్​. ఇస్మార్ట్​ శంకర్​ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్​ను కలవడానికి ప్రయత్నించినా..ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. దీంతో తాను తమిళ ప్రొడ్యూసర్​ కౌన్సిల్​లో ఫిర్యాదు చేశానని, సత్వర పరిష్కారం కోసం తెలుగు మీడియాను ఆశ్రయించానని చెప్పారు. తాను హీరోగా తీసిన ‘నాన్​ యార్​’ సినిమా, ఇతర ఆధారాలను మీడియా ఎదుట ఆకాశ్​ ఉంచారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో తాను లీగల్​ యాక్షన్​ తీసుకుంటానని ఆకాశ్​ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here