ఒకవైపు పాకిస్థాన్ నేతృత్వంలోని ఉగ్రదాడి.. మరోవైపు ప్రతిపక్ష విమర్శల దాడిని ఏకకాలంలో ఎదుర్కుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇరకాటంలో పడ్డారు. బీజేపీ కర్ణాటక నేత యడ్యూరప్ప వ్యాఖ్యల కారణంగా ఇరకాటంలో పడ్డారు. వైమానిక దాడి కారణంగా తమకు రాజకీయ లబ్ది కలుగుతుందని వ్యాఖ్యానించడమే మోదీకి ఇరకాట పరిస్థితి. పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన రెండోరోజే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. రాజకీయ కోణం ఉందంటూ విమర్శించడం, దానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వంత పాడారు. ఆ తరువాత కాంగ్రెస్ కూడా రాజకీయ కోణం ఉందంటూ విమర్శలు గుప్పించింది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన 11 రోజులకు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల శిబిరంపై వైమానిక దాడులు చేసిన సైనికులు.. 350 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఘటన జరిగిన రోజు ప్రధాని మోదీ దగ్గరుండి పర్యవేక్షించారని వెల్లడి కావడంతో.. ఆయన ప్రతిష్ట ఒక్కసారిగా ఆకాశానికి పెరిగి పోయింది. ఇంతలోనే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలతో మోదీ ఇరకాటంలో పడ్డారు. యడ్యూరప్ప వ్యాఖ్యలను పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ లో పరోక్షంగా ప్రస్తావించడంతో ఒక్కసారిగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ, మోదీ వ్యతిరేక మీడియా పెద్దఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే మోదీ ఈ ఇరకాటం నుంచి ఎలా బయట పడతారో చూడాలి.