Home breaking news ఇప్పుడు లౌకిక‌వాదులు క‌న‌బ‌డ‌రేం.. మాట్లాడ‌లేరా..?

ఇప్పుడు లౌకిక‌వాదులు క‌న‌బ‌డ‌రేం.. మాట్లాడ‌లేరా..?

396
0
బీజేపీలో చేరిన గులిస్తానా(మ‌ధ్య‌లో క‌ళ్ల‌ద్దాలు ధ‌రించిన మ‌హిళ‌. ఇంట‌ర్నెట్ ఫొటో)

లౌకిక‌వాదులుగా చెప్పుకునే వాళ్ల‌కు అన్నీ క‌న్పిస్తాయి. ఎక్క‌డేం ఏం జ‌రిగిన‌ట్టు క‌న్పించినా… మ‌త‌త‌త్వ‌వాదులుగా గుర్తించిన కొంద‌రిపై విమ‌ర్శలు. డౌన్ డౌన్ అంటూ నినాదాలు. ఇప్పుడు మ‌నం ప్ర‌స్తావించుకునే అంశం స‌హా ఇటువంటివి ఎంత‌ మాత్రం వారికి క‌న్పించ‌వు. ఎందుకంటే వాళ్లు లౌకిక‌వాదులు క‌నుక‌.

ఇంత‌కీ విష‌య‌మేమిటంటే.. యూపీకి చెందిన‌ ఒక ముస్లిం మ‌హిళ గులిస్తాన్‌.. బీజేపీలో చేరింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని ప్ర‌శంసించింది. ఆమె స‌భ్య‌త్వం తీసుకున్న‌ ఫొటో ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చింది. గులిస్తాన్‌ బీజేపీలో చేర‌డం ఆమె అద్దెకు ఉంటున్న‌ ఇంటి య‌జ‌మాని స‌ల్మాన్ కు న‌చ్చ‌లేదు. వెంట‌నే ఆమెను ఇంటి నుంచి బ‌య‌ట‌కు గెంటేశాడు. ఇది జ‌రిగి 24 గంట‌లు గ‌డిచింది.. ఇప్పుడు గులిస్తాన్ రోడ్డుపై ఉంది. దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. పోలీసులు ఇంటి య‌జ‌మానిని అరెస్ట్ చేశారు. అత‌డి కుమారుడు, కుటుంబ‌స‌భ్యులు ప‌రారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

బీజేపీలో ముస్లిం మ‌హిళ చేరినందుకు.. ఆమెను ఇంటి య‌జ‌మాని ఇంటి నుంచి త‌రిమేశారు. ఈ అంశం మీద‌ లౌకిక‌వాదిగా చెప్పుకునే ఏ ఒక్క‌రూ ఈ అంశంపై స్పందించ‌లేదు. ఇదే ప‌నిని హిందూ మ‌తానికి చెందిన వ్య‌క్తి చేస్తే.. అబ్బో లౌకిక‌వాదం వెంట‌నే ముందుకొస్తుంది. మ‌తోన్మాధులారా ఖ‌బ‌ర్దార్‌. డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున విన్పిస్తాయి. ప‌త్రిక‌ల్లో వ్యాసాలు.. ఏం ఇప్పుడు లౌకిక‌వాదులు మాట్లాడ‌లేరా..? ఎందుకో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here