Home తాజా వార్తలు ఇప్పుడీ దెప్పిపొడుపెందుకు.. చంద్ర‌బాబును కీర్తించింది త‌మ‌రే సామీ

ఇప్పుడీ దెప్పిపొడుపెందుకు.. చంద్ర‌బాబును కీర్తించింది త‌మ‌రే సామీ

201
0
ఇప్పుడీ దెప్పిపొడుపెందుకు.. చంద్ర‌బాబును కీర్తించింది త‌మ‌రే సామీ
చంద్ర‌బాబుతో ఏబీఎన్ రాధాకృష్ణ (ఇంట‌ర్నెట్ నుంచి)

తాజా కొత్త‌ప‌లుకులో సీఎం వైఎస్ జ‌గ‌న్ మీద త‌న‌కెంత కోప‌ముందో రాధాకృష్ణ గారు చాటి చెప్పుకున్నారు. ప‌నిలో పనిగా టీడీపీ ఓడిపోవ‌డంలో త‌న (ఆంధ్ర‌జ్యోతి) పాత్ర ఇసుమంతైనా కూడా లేద‌ని చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబే వాస్త‌వ ప‌రిస్థితులు గుర్తించ‌లేదంటూ దెప్పిపొడిచారు. కార్య‌క‌ర్త‌ల‌తో మ‌మేకం కాలేద‌ని రాసుకొచ్చారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో గుర్తించ‌డంలో విఫ‌ల‌మ్యారంటూ పేర్కొన్నారు. రాధాజీ ఇంకేం రాసుకొచ్చారంటే..

చంద్రబాబు మార్క్‌ పాలన కనిపించడం లేదని తొలి ఏడాదే ప్రజలలో గుర్తించార‌ని అభిప్రాయం ఏర్పడినా.. దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. పార్టీ శాసనసభ్యుల విచ్చలవిడితనాన్ని అరికట్టవలసిందిపోయి నిస్సహాయుడిగా ఉండిపోయారు. బలమైన వ్యక్తులు– శక్తులు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వంపై భారీ స్థాయిలో వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా ఖాతరు చేయలేదు
మరి త‌మ‌రేం చేశారు మ‌హాశ‌యా..ఇప్పుడీ తొలిప‌లుకులో రాసేందే ఆనాడే రాసి ఉంటే.. ఎలాగుండేదో కానీ త‌మ‌రు అలా చేయ‌కుండా.. చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా.. ఇంద్రుడు..చంద్రుడు అంటూ క‌థ‌నాలు రాసింది మీరే సామీ. ఏపీలో టీడీపీ బ్ర‌హ్మాండంగా ఉంది.. జ‌గ‌న్ అనేవాడికి డిపాజిట్లు రావ‌ని రాసుకొచ్చింది త‌మ‌రే. పోలింగ్ జ‌రిగేట‌ప్పుడు కూడా.. బాబుదే అధికార‌మంటూ రాసింది త‌మరే. పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా స‌ర్వే చేసి.. బాబుదే అధికారమంటూ రాసిందీ మీరే క‌దు సామి. ఇప్పుడీ దెప్పిపొడుపెందుకు. మీ స్టాఫ్ చెప్పింది మీరు విన‌లేదు. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను మీరు గ‌మ‌నించ‌లేదు. ఆనాడే ఆహా ఓహో అని రాయ‌కుడా.. వాస్త‌వ ప‌రిస్థితులు మీరు గ‌మ‌నించి.. బాబుకు స‌రిగ్గా చేర‌వేసి ఉంటే.. ప‌రిస్థితి ఇలా ఉండేదీ కాదు. మీరు బాబుకు చెప్ప‌లేదు. త‌ప్పందా చంద్ర‌బాబుదే.. ఆయ‌నకు ఓట్లు వేయ‌ని ప్ర‌జ‌ల‌ది కాదంటూ పేర్కొన్నారు. ఇది నిజ‌మే.. ఎందుకుంటే వాస్త‌వాలు గుర్తించ‌కుండా మీరు చెప్పిన త్రిశంకు స్వ‌ర్గంలో చంద్ర‌బాబు విహ‌రించాడుగా త‌ప్పే. అందుకే అంటారు.. శ‌తృవు వ్యూహం తెలుస్తుంది కానీ మితృల వ్యూహం తెలుసుకోలేమ‌ని.

స‌రే ఇప్పుడ‌న్నా.. బాబుకు వాస్త‌వ ప‌రిస్థితులు చెబుతున్నారా..? అంటే అదీ లేదు. ఇప్పుడీ కొత్త‌ప‌లుకు.. వీకెండ్ స్టోరీలో అదే బాట‌. జ‌గ‌న్ అనే వాడిని ఎందుకు గెలిపించామా..? అని ఏపీ ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారంటూ రాసుకొచ్చారు. ప్ర‌జ‌లకు ఇప్పుడే బాధ‌లు ఇంకా తెలియ‌లేదు సామి.. త‌మరు మాత్రం బాగా బాధ‌ప‌డుతున్న‌ట్టున్నారు. మొత్తానికి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి న‌వ్వును గుర్తించి.. ఆయ‌న న‌వ్వు వెకిలిగా ఉండేదీ కాదు రాజసంగా ఉండేద‌ని కితాబిచ్చారు. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు స‌మకాలికులు కాబ‌ట్టే.. వారి మ‌ధ్య జ‌రిగిన సంవాదం ఎబ్బెట్టుగా ఉండేదీ కాదంటున్న.. రాధాజీ.. ఇదే చంద్ర‌బాబు.. వైఎస్ జ‌గ‌న్‌ను ప‌ట్టుకొని దొంగ అని సంబోధించిన‌ప్పుడు చిన్నోడిని ప‌ట్టుకొని ఏం మాట‌లంటూ మంద‌లించ‌లేదేం. ఆనాడు బాబు చేసింది క‌రెక్ట్ అయితే.. ఈనాడు జ‌గ‌న్ చేసింది కూడా క‌రెక్టే.

ఇంకేం రాసుకొచ్చారో చూడండి

1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 1999 ఎన్నికలలో గెలుపు కోసం ప్రజలలో తన పట్ల పాజిటివ్‌ అభిప్రాయం ఏర్పడటానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తటస్థులను, సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. 1999 ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎలా వ్యవహరించారో దాదాపుగా అలాగే వ్యవహరించారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందంటూ అప్పట్లో అఖిలపక్ష సమావేశాలకు కూడా కమ్యూనిస్టులను ఆహ్వానించకుండా అహం ప్రదర్శించారు. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు, ఇతర పార్టీల ఉనికిని గుర్తించడానికి ఆయన ఇష్టపడలేదు.

చానా రోజుల త‌ర్వాత క‌మ్యూనిస్టుల‌ను రాధాజీ గుర్తించారు. వారికి గెలిపించే శ‌క్తి పూర్తిగా లేకున్నా.. ఓడించే శ‌క్తి మాత్రం ఉంది. ఈ విష‌యాన్ని ఇంకా గుర్తించ‌న‌ట్టున్నారు. ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా 1995లో బాధ్య‌త‌లు చేప‌ట్టార‌న్న రాధాజీ.. అధికారంలో ఎలా చేప‌ట్టారో ప్ర‌స్తావించి ఉంటే బాగుండేదీ. ఇంకా 1999లో చంద్ర‌బాబు గారి సొంత బ‌లం వ‌ల్ల గెల‌వ‌లేదు. వాజ్‌పేయ్ ప‌ట్ల దేశ ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానాన్ని చంద్రబాబు క్యాష్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని విప్పి చెప్ప‌కుండా.. బాబు పాజిటీవ్ ఉంది కాబ‌ట్టే.. 1999 ఎన్నిక‌ల్లో గెలిచారంటూ మ‌ళ్లీ అభిమానం చూపించారు. అలా అయితే 2004లో చంద్ర‌బాబు ఓడిపోవ‌డానికి మీరు చెప్పిన కార‌ణాలు కాదు రాధాజీ. వాజ్‌పేయ్ ప్ర‌భ క్షీణించ‌డ‌మే. క‌మ్యూనిస్టులను గుర్తించి.. ద‌గ్గ‌ర చేర్చుకున్నా.. 2009లో ఎందుకు ఓడించారు సామీ.? ఆనాడు కూడా గెలిచేస్తున్నారంటూ త‌మ‌రి ప‌త్రిక‌ల్లో రాసుకొచ్చారు. మీ సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఒక ఉద్యోగితో చంద్ర‌బాబు గెలుస్తున్నారంటూ బెట్ క‌ట్టారు. చివ‌ర‌కు బాబు ఓడిపోవ‌డంతో స‌ద‌రు ఉద్యోగికి మీరు రూ. 5 వేలు ఇచ్చుకున్న‌ది గుర్తు తెచ్చుకోండి సామీ. మొత్తానికి చంద్ర‌బాబు చేసిన త‌ప్పల్లా బ‌య‌టివాళ్లు చెప్పింది న‌మ్మ‌డ‌మే అని రాధాజీ చెప్పారు. కానీ అందులో త‌మ‌రి పాత్ర ఉంద‌ని మ‌రిచిపోయారు సామీ.

క‌డిగేయ‌డం అంత వీజీ కాదు
నిజ‌మే అవినీతిని క‌డిగేయ‌డం అంత వీజీ కాదు. అవినీతి కేసులో జ‌గ‌న్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సీబీఐ మాజీ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఓడించారు. అక్క‌డ ప‌వ‌నాలు పార్టీకే దిక్కులేదు. ఇక జేడీకెక్క‌డిది దిక్కు. మ‌నం లంచ్ం ఇచ్చే ప‌రిస్థితికి కొస్తే అవినీతిని వ్య‌తిరేకిస్తాం. అదే తీసుకునే ప‌రిస్థితి వ‌స్తే.. ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని స‌ర్ది చెప్పుకుంటాం. ఇది ఏ ఒక్క‌రిదో కాదు లోక‌నీతి. స‌రే జ‌గ‌న్ విష‌యానికొస్తే త‌మ‌రి ప‌లుకులో జగ‌న్‌పై ఉన్న కోపాన్నంత రంగ‌రించి రాసిన‌ట్టున్నారు. ఆయ‌న సీఎం కుర్చీపై కూర్చుని నిండా రెండు నెల‌లు కాలేదు. అప్పుడే ఎందుకీ రాత‌లు. చంద్ర‌బాబును అన్నందుకే రాసిన‌ట్టుగా క‌న్పిస్తోంది. చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా.. జ‌గ‌న్ ప‌రిస్థితి చూశారుగా.. ఎలా ఉందో. మీకు చంద్ర‌బాబు క‌ళ్ల‌ద్దాలు ఉండ‌బ‌ట్టే క‌న్పించ‌క పోవ‌చ్చు. కానీ జ‌నం చూశారు. అందుకే 151 సీట్ల‌ను అప్ప‌గించారు. మీరు రాసిన‌ట్టుగా.. ముఖ్యమంత్రిగా జగన్‌ చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఇంకా ఏర్ప‌డలేదు. అలా ఏర్ప‌డాలంటే ఇంకా చాలా టైముంది.

సీఎం జ‌గ‌న్‌కు రాధాజీ ఇచ్చిన స‌ల‌హా ఏంటంటే..
ఈ ప‌లుకు ద్వారా రాధాజీ చెప్ప‌దలుచుకున్న‌దేమిటంటే.. ముఖ్య‌మంత్రిగా అపార అనుభ‌వ‌మున్నా చంద్ర‌బాబు వ‌ద్దకు జ‌గ‌న్ వెళ్లాలి. స‌ల‌హాలు తీసుకోవాలి. ఆ విధంగా బాబును రాజ‌కీయంగా దెబ్బ‌కొట్ట‌వ‌చ్చ‌న‌ది సారాంశం. చూడండి ఏ విధంగా రాశారో..
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని దెబ్బతీస్తున్నామని అధికారపక్ష సభ్యులు భావిస్తున్నారేమో తెలియదు గానీ, ఈ ధోరణి వల్ల చంద్రబాబుకు సానుభూతి తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు. ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా ఫినిష్‌ చేయాలని ముఖ్యమంత్రికి ఉండి ఉండవచ్చు. అయితే అందుకిది మార్గం కాదు. అనుకూల ధోరణిని ప్రదర్శించడం ద్వారా కూడా చంద్రబాబుని రాజకీయంగా కోలుకోకుండా చేయవచ్చు. ముఖ్యమంత్రిగా అపార అనుభవమున్న చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టాలంటే ‘‘కీలకమైన ప్రభుత్వ వ్యవహారాలలో మీ సలహా ఇవ్వండి’’ అని కోరితే ఎలా ఉంటుందో జగన్మోహన్‌రెడ్డి ఆలోచించడం మంచిది. చంద్రబాబు సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు ప్రజలు అభిప్రాయపడేలా చేయగలిగితే, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం చంద్రబాబుకు ఉండదు కదా?
ఇదెట్లా ఉందంటే.. మా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లావ‌నుకో నీకు అనుభవం లేదు. మా వోడికే అనుభ‌వ‌ముంద‌ని ప్ర‌జ‌లు అనుకుంటారు. ఆ రకంగా నీకు నువ్వే దెబ్బ‌తీసుకోవ‌చ్చు అని రాధాజీ జ‌గ‌న్కు చెప్పిన సారాంశం.

జ‌గ‌న్ అంత వీజీ మ‌నిషి కాదు

జ‌గ‌న్ అంత వీజీ మ‌నిషి కాదు రాధాజీ. గెలుపు మీద ఉన్న‌ క‌సితో ఎవ‌రెంత గేలి చేసినా.. రాసినా రాయ‌కున్నా.. తిట్టినా.. అవ‌హేళ‌న చేసినా ఏడాదిన్న‌ర పాటు జ‌నంలో తిరిగి గెలిచిన మ‌నిషి. మీరు చెప్పినంత వీజీగా ఓడిపోవ‌డానికి ప్లాన్ వేసుకుంటాడా..? ఇక్క‌డ‌ జ‌గ‌న్‌కు ఉన్న ప్ల‌స్‌ వ‌య‌సు. రానున్న రోజుల్లో అనుభ‌వ‌మూ వ‌స్తుంది. మీరు చెప్పిన‌ట్టుగా చంద్ర‌బాబుకు అనుభ‌వ‌ముండొచ్చు.. కానీ వ‌య‌సు లేదుగా..? సో చంద్ర‌బాబు వ‌య‌సు స‌మ‌స్యకు ప‌రిష్కారం కూడా లేదు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబుకు జ‌గ‌న్‌కు కూడా వాస్త‌వాలు తెలిసే విధంగా క‌ల్పితాలు.. ఈ అనుకోవ‌డాలు లేకుండా త‌మ‌రి ప‌త్రిక ప‌ని చేస్తే.. మొన్న‌టి ఎన్నిక‌లకు ముందు ఫిల్మ్‌సిటీకి వెళ్లి మ‌రీ ఈనాడు రామోజీరావును క‌లిసిన‌ట్టు.. జ‌గ‌న్ మీ వ‌ద్ద‌కే వ‌స్తాడు రాధాజీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here