Home జాతీయం ఇప్పుడా ఆ పార్టీకి *డిఫ‌రెంట్* ట్యాగ్‌లైన్ లేకుండా పోయింది గురూ

ఇప్పుడా ఆ పార్టీకి *డిఫ‌రెంట్* ట్యాగ్‌లైన్ లేకుండా పోయింది గురూ

246
0
అమిత్ షాతో బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా.. బీజేపీలో చేరిన ఏపీ ఎంపీలు (file photo)
  • వికాస్ రుషి

కాలం గ‌డుస్తున్న కొద్ది.. వీరు వాళ్ల‌వుత‌రంట‌. వాళ్లు వీర‌వుత‌రంట‌. బీజేపీ విష‌యంలో ఇదే నిజ‌మైపోయింది. ఇప్పుడా పార్టీ ఫ‌క్తు కాంగ్రెస్ మాదిరిగా మారి.. రాజ‌కీయాలు కూడా అలానే చేస్తూ పోతోంది. 1980లో పుట్టిన ఈ పార్టీకి డిఫ‌రెంట్ అన్న ట్యాగ్‌లైన్ ఇటీవ‌ల వ‌ర‌కూ ఉండేది. బీజేపీ వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా.. పార్టీ పేరు కింద‌ ఇది క‌న‌ప‌డేదీ. ఈ మ‌ద్య క‌న్పించ‌డం లేదు. మ‌రి నిశితంగా రోజూ ప‌రిశీలించ‌లేం క‌దా. ఇటీవ‌లే.. బీజేపీ వెబ్‌సైట్ హ్యాక్ అయింద‌న్న క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ కొత్త‌గా ఏర్పాటు చేశార‌నుకోండి. చాన్నాళ్ల త‌రువాత బీజేపీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే డిఫ‌రెంట్ అనే ట్యాగ్‌లైన్ క‌న్పించ‌లేదు. ఇది కావాల‌ని తీసేశారా..? లేదా మ‌రిచిపోయారా..? అన్న సంగ‌తి ప‌క్క‌న పెడ‌దాం.

పార్టీ మోదీ, అమిత్ షా చేతుల్లోకి వెళ్ల‌క ముందు బీజేపీ నిజంగా ప్ర‌త్యేక‌త‌లు క‌లిగి ఉన్న పార్టీయే అందులో సందేహం లేదు. జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులు.. మాట మార్చ‌డాలు వంటివి క‌న్పించేవీ కావు. పార్టీ ఎప్పుడైతే మోదీ, షా ధ్వ‌యం చేతుల్లోకి వ‌చ్చిందో అప్ప‌టి నుంచి బీజేపీ తీరే మారిపోయింది. పార్టీ బ‌ల‌ప‌డ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌క్కా రాజ‌కీయ ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది. 2014లో అధికారంలోకి రావ‌డం త‌రువాయి.. ముందుగా త‌న స‌హ‌జ‌ మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన నుంచి ఎంపీ సురేశ్ ప్ర‌భును లాగేసింది. అయితే రాజ్‌పూర్ లోక్‌స‌భ స్థానంలో శివ‌సేన అభ్య‌ర్థిగా గెలిచిన‌ ఆయ‌న‌తో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయించింది. త‌ద్వారా వేరే పార్టీ నుంచి వ‌చ్చిన నాయ‌కుడు ఎవ‌రైన ప్ర‌జాప్ర‌తినిధి ప‌ద‌వికి రాజీనామా చేయించాల‌న్న త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ఆ త‌ర్వాత ఏపీ నుంచి రాజ్య‌స‌భకు పంపించింది. (ఇప్పుడు మాత్రం మంత్రివ‌ర్గంలోకి తీసుకోలేదు)

ఆ త‌ర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ విస్త‌ర‌ణ‌కు రాజ‌కీయ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేయ‌డం, ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా విస్త‌రించి.. ఇప్పుడు ప్ర‌పంచంలో అతి పెద్ద పార్టీగా నిలిచింది. కౌన్సిల‌ర్ లేని త్రిపుర వంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చింది. క‌మ్యూనిస్టు కోట బెంగాల్‌ను టీఎంసీ హ‌స్త‌గ‌తం చేసుకుంటే.. ఇప్పుడా రాష్ట్రాన్ని త‌న చేతుల్లోకి తెచ్చుకోవ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. టీఎంసీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకుంది. ఇప్పుడు బీజేపీలో చేరిన నేతలు..త‌మ‌ పాత పార్టీ నుంచి వ‌చ్చిన రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన‌ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న రాజకీయాలు చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. వీళ్లు త‌మ రాజ్య‌స‌భ ప‌క్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇక రాజీనామాల అవ‌స‌రం లేదు. తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (మునుగోడు) బీజేపీలో చేర‌బోతున్నారు. టీఆర్ఎస్‌లో చేరిపోగా మిగిలిన ఎమ్మెల్యేల్లో మ‌రికొంద‌రిని త‌న‌తో పాటు తీసుకొని పోవాల‌ని, త‌ద్వారా అన‌ర్హ‌త వేటు నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నారు. అది సాధ్యం కాకుంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. స్వ‌తంత్ర ఎమ్మెల్యేగా గుర్తించాల‌ని స్పీక‌ర్‌కో లేఖ రాస్తే చాలు. సో.. బీజేపీ వెబ్‌సైట్‌కు ఉన్న డిఫ‌రెంట్‌ ట్యాగ్‌లైన్ ఓక్క‌టే కాదు. ఆ పార్టీ త‌న ప్ర‌త్యేక‌త‌ను కూడా ఫ‌క్తు రాజ‌కీయాల కార‌ణంగా కోల్పోయి.. కాంగ్రెస్ మాదిరిగా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here