Home తాజా వార్తలు ఇప్పుడన్న కేసీఆర్ లెక్క క‌రెక్టైత‌దా..?

ఇప్పుడన్న కేసీఆర్ లెక్క క‌రెక్టైత‌దా..?

169
0
  • వికాస్ రుషి

తొంద‌ర‌ప‌డి ఒక కోయిల ముందే కూసింది. చిందులు వేసిందన్న పాట చానా మందికి యాదికి ఉండే ఉంటంది. ఈ పాట కంటే 2009 ఎల‌చ్చ‌న్లు కూడా యాదికుండే ఉంటుంది. ఈ ఎల‌క్ష‌న్ల‌లో బీజేపీ ప‌వ‌ర్‌లోకి వ‌స్తంద‌నుకొని మ‌న సీఎం కేసీఆర్‌.. హ‌డావుడిప‌డి.. పంజాబ్‌లో ఉన్న బీజేపీ పెద్ద నాయ‌కుడు అద్వానీని క‌లిసి మీ ఎంట ఉంట‌న‌ని చెప్పేశాడు. అప్పుడు ఇక్క‌డ చంద్ర‌బాబుతోటి పొత్తు పెట్టుకున్న‌డు. చంద్ర‌బాబును కాద‌ని జ‌ల్దిన అద్వానీని క‌లిసుండు. తీరా రిజ‌ల్ట్ రివ‌ర్స్‌.. కాంగ్రెస్ లెక్క‌లోని యూపీఏ ప‌వ‌ర్‌లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ కేసీఆర్ నాలుక్క‌ర్సుకున్నాడ‌నుకో. మొన్న తెలంగాణ‌ల ఎల‌చ్చ‌న్లు కాక‌ముందే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పెడ‌తాన‌ని హ‌డావుడిగా.. రెండు మూడు స్టేట్ల‌కెళ్లి.. ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసి వ‌చ్చిండు. ఆగిపోయిండు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎపీ ఎల‌చ్చ‌న్లు ఐపోయిన‌గా.. మ‌ళ్లీ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ తిరుగుడు మొద‌లు పెట్టే. నిన్న‌టికి నిన్న కేర‌ళ సీఎం, ఎర్ర‌పార్టీ నాయ‌కుడు పిన‌ర‌య్ విజ‌య‌న్‌ను కలిసే,

కేసీఆర్‌కు పిన‌ర‌య్ బొకే

త‌మిళ‌నాడుల స్టాలిన్ క‌లుస్తడంట‌. ఇట్ల అందరిని కలుస్తండంట‌, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి చెబుత‌డంట‌. బీజేపీ, కాంగ్రెస్‌కు అధికారం రాదు. ఇక ప్రాంతీయ పార్టీల‌దే రాజ్య‌మంటూ చెప్ప‌బ‌ట్టే. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉందిక‌ని. ఇప్ప‌టికి కేసీఆర్ లెక్క‌లు రెండు సార్లు త‌ప్పిన‌యి. 2009 బీజేపీ అధికారంలోకి వ‌స్త‌ద‌ని రిజ‌ల్ట్ రాక‌ముందే అద్వానీని క‌లిసే. 2014 ఎల‌చ్చ‌న్ల కూడా జాతీయ పార్టీల‌కు అధికారం రాదు. ప్రాంతీయ పార్టీల‌దే రాజ్య‌మ‌ని చెప్పే లెక్క త‌ప్పింది. 2014 ఎన్నిక‌లల్ల ఆంధ్ర‌ల జ‌గ‌న్ సీఎం అయిత‌డ‌ని చెప్పే లెక్క త‌ప్పే. 2019 ఎల‌చ్చ‌న్ల‌ల్ల ప్రాంతీయ పార్టీల‌దే రాజ్య‌మ‌ని చెప్ప‌బ‌ట్టే.. కాలుకు బ‌ల‌పం క‌ట్టుకొని తిర‌గ‌బ‌ట్టే. ఇదే మ‌యిత‌దో.? క‌నీ. ఇప్పుడు మ‌న‌కు స‌మ‌జ్ కాని ముచ్చ‌ట ఇక్క‌డొక‌టి ఉంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పెడ‌తానంటూ ఊళ్లు తిరుగుతూ సీఎంల‌ను క‌లుస్తున్న‌ కేసీఆర్‌.. ఫ్యామిలీని ఎందుకు తీసుకెళ్లినట్టు. ఆయ‌న ఎళ్లింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోస‌మేనా..? లేక ఎండ‌కాలం సెల‌వుల్లో తీర్థ యాత్ర‌లు చేయ‌డానికి ఫ్యామిలీని తీసుకెళ్లిండా..? ఆయ‌న‌తో పాటు ముద్దుల మ‌న‌వ‌డు. మ‌న‌వ‌రాలు కూడా ఉన్నారులే. చూద్దాం.. ఈసారైనా.. కేసీఆర్ లెక్క స‌రిగా కుదురుతుందా..? వెయిట్ చేద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here