Home breaking news ఇన్ని రోజులెందుకు.. ఈ ముక్కేదే ముందే చెబితే పోయోదీ గా..!

ఇన్ని రోజులెందుకు.. ఈ ముక్కేదే ముందే చెబితే పోయోదీ గా..!

130
0
సీఎం కేసీఆర్​

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్​ మొత్తానికి స్పందించారు. ఆ ఒక్కటి దక్క చర్చలకు సరే అన్నారు. ఈ ముక్కేదో ముందే చెబితే ఇంత జరగక పోయేదీ. ఆర్టీసీ విలీనం తప్ప మిగిలిన అంశాలపై చర్చకు సిద్ధమని సీఎం కేసీఆర్​ చెప్పినట్టుగా ఈ రోజు పత్రికల్లో వచ్చింది. ఆర్టీసీ సమ్మె మొదలైన కాడ్నించి.. ఈ రోజు వరకూ ఏనాడు సీఎం కేసీఆర్​ నేరుగా రిపోర్టర్లతో కాని, పబ్లిక్​తో కాని మాట్లాడింది లేదు. ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో కాని విడుదల కాలేదు. ఆయన పేరుతో ప్రకటనలు రావడమే.. అది కూడా నేరుగా పత్రికాఫీసులకు..  అందునా హెచ్​ఓడీలకే స్టేట్​మెంట్​ వస్తోంది. దాన్ని యాధాతధంగా పత్రికల్లో అచ్చేయడమే.. దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులుండవు. ఉండకూడదు. సమ్మె ఐదో తేదీన స్టార్టయైంది. ఆ తర్వాతే స్టేట్​మెంట్​.. చర్చల్లేవ్​. మళ్లో స్టేట్​మెంట్​ గుండాగిరి నడవదు. చర్చల్లేవ్​. ఆ తర్వాత ఇలా సీరియల్​గా చర్చల్లేవు అంటూనే స్టేట్​మెంట్లు. చర్చలు జరపాలని న్యాయస్థానం నుంచి వచ్చినా.. చర్చల్లేవని చెప్పేశారు. నిన్న న్యాయస్థానం పంపించిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండంటూ పేర్కొన్న నోట్​ సర్కారుకు చేరింది. సరే విలీనం దక్క.. మిగిలిన అంశాలపై చర్చలు జరపడానికి ఒక కమిటీని వేస్తున్నట్టు కేసీఆర్​ పేరు మీద స్టేట్​మెంట్​ వచ్చేసింది.

ఇది చూసిన తర్వాత అందరికీ వస్తున్న అనుమానమేమిటంటే.. ఈ ముక్కేదే ముందే చెబితే సరిపోయేదీ. సమ్మె జరగకుండా ఆగేదీ. ఇది చెప్పిన తర్వాత కార్మికులు సమ్మెకు దిగితే.. అందరూ రివర్సయ్యేవారు. ఆర్టీసోళ్ల మీద సానుభూతి రాకపోయేదీ. ఇదంతా జరిగిన తర్వాత తీరిగ్గా.. ఆ ఒక్కటి దక్క చర్చలంటూ స్టేట్​మెంటేమిటీ..? అని. మన అనుమానం నిజమే కానీ. కేసీఆర్​ మనసులో ఏముందో ఎవరు పసిగట్టగలరు. ఆయనేం చేస్తారో ఎవరికి తెలుసు. అందరూ నిమిత్తమాత్రులే. అయితే ఒక్కటి మాత్రం చేయగలిగారు. అద్దె బస్సులకు కేసీఆర్​ నోటిఫికేషన్​ ఇచ్చారు. దానికి స్పందన కూడా వచ్చింది. సమ్మె ముగిసినా.. కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా చేసుకోగలిగారు. అద్దె బస్సులపై వ్యతిరేకతా.. ఇది కేసీఆర్​కు లెక్కకాదు. ఆయన అందరిలాంటి నేతా కాదు. ఎవరిని ఎలా దరికి చేర్చుకోవాలో.. ? దూరంగా పెట్టాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలీదు. ఒక్కటి మాత్రం నిజం. అన్ని రోజులు మాత్రం మనవి కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here