Home breaking news ఇదే మాట వేరేవాడు అంటే.. దేశమంతా అల్ల‌క‌ల్లోలమే

ఇదే మాట వేరేవాడు అంటే.. దేశమంతా అల్ల‌క‌ల్లోలమే

443
2
mp nusrat jahan

ఒక్కొక్క‌రికి ఒక్కోనీతి.. ఇది భార‌తదేశంలో న‌డుస్తున్న తంతు. బుజ్జ‌గింపు వ్య‌వ‌హారం ఇక్క‌డ బాగా.. సాగుతోంది కాబ‌ట్టి.. కులం, మ‌తం బ‌ట్టి నీతి న‌డుస్తోంది. ఒక‌డు ఎన్నిమాట‌ల‌న్న ఎవ‌డూ ప‌ల్లెత్తి మాట్లాడ‌డు. అదే మ‌రొక‌డు అంటేనే.. దేశమంతా అల్ల‌క‌ల్లోల‌మే. విష‌య‌మేమిటంటే.. ముస్లిం మ‌తానికి చెందిన నుస్ర‌త్ జ‌హాన్‌.. జైన మ‌తానికి చెందిన వ్యాపార‌వేత్త నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకుంది. భ‌ర్త మ‌తాన్ని ఆమె ఆచ‌రిస్తోంది. అనుస‌రిస్తోంది. స‌హ‌జంగానే.. ఈ మతాంతీక‌ర‌ణ వివాహం ముస్లిం మ‌త పెద్ద‌ల‌కు క‌డుపు మంట క‌ల్గించింది. ఇటీవ‌ల‌ జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నుస్ర‌త్ జ‌హాన్‌.. తృణ‌మూల్ కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి గెలిచింది. లోక్‌స‌భ స‌మావేశాల‌కు నుస్ర‌త్ జ‌హాన్ నుదుట‌ సిందూరం, గాజులు,మ‌ట్టెలు, చీర ధ‌రించి హాజ‌ర‌య్యారు. అంతే కొంద‌రు ముస్లిం మ‌త పెద్ద‌లు భ‌గ్గున మండిపోయారు.

అస‌లీ మ‌త పెద్ద‌ల‌కు ఆమె జైనమ‌తానికి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం కంటే.. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంద‌ర్శంగా తొలుత మాసా అల్లా అని మొదలు పెట్టి.. జైహింద్‌.. వందేమాత‌రం అన‌డ‌మే మంట క‌ల్గించిన‌ట్టుంది. ఒక మ‌త పెద్ద ఏకంగా ఆమెకు వ్య‌తిరేకంగా ప‌త్వా జారీ చేశారు. ముస్లింలు.. ముస్లింల‌ను మాత్ర‌మే పెళ్లాడాల‌ని ఇస్లాం చెప్తోంద‌ని.. ఈ వివాహం చెల్ల‌ద‌ని ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ఫ‌తేపూర్ మ‌సీదు షాహి ఇమామ్‌.. ముఫ్తీ ముక‌రం అహ్మ‌ద్ ఈ వివాహం చెల్ల‌దంటూ.. సిందూరం పెట్టుకోవ‌డాన్ని ఇస్లాం అంగీక‌రించ‌ద‌ని, రెండు మ‌తాలు నుస్ర‌త్ వివాహాన్ని గుర్తించ‌వ‌ని వ్యాఖ్యానించారు. ఈ వివాహం చేసుకోవ‌డం ద్వారా నుస్ర‌త్ నేరానికి పాల్ప‌డ్డార‌ని కూడా చెప్పారు. ఇప్పుడు ముస్లిం మ‌త పెద్ద‌లు చేసిన ప్ర‌క‌ట‌నపై చ‌ర్చ న‌డుస్తోంది. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వీరిద్ద‌రి ప్ర‌క‌ట‌న ఖండించిన పాపాన పోలేదు.

ఒక వేళ‌.. ఒక ముస్లిం అబ్బాయి.. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని.. ముస్లీం మ‌త సంప్ర‌దాయాన్ని పాటిస్తే.. ఆ వివాహాన్ని హిందూ మ‌తానికి చెందిన ఏ ఒక్క పూజారో ఖండిస్తూ ప్ర‌క‌ట‌న చేస్తే.. ఇప్ప‌టికే దేశ‌మంతా అల్ల‌క‌ల్లోల‌మ‌య్యేది. లౌకిక‌వాదం నాశ‌న‌మై పోతున్న‌ద‌ని రాజ‌కీయ పార్టీల నేత‌లు మండిప‌డేవారు. ఒక ముస్లిం హిందూ అమ్మాయిని చేసుకోవ‌ద్దా..? అనే వారు. చివ‌ర‌కు సంఘ్ ప‌రివార్‌కు ఈ ఘ‌ట‌న‌ను ముడిపెట్టేవారు. భార‌త‌దేశంలో.. ముస్లిం, క్రిష్టియ‌న్ మ‌తాల‌కు చెందిన పెద్ద‌లు ఏం మాట్లాడిన చెల్లుతుంది. వారికి అంద‌రూ మ‌ద్ద‌తుగా నిలుస్తారు. అదే హిందూ మ‌తానికి చెందిన వాడు ఎవ‌డూ ఒక మాట మాట్లాడితే చాలు.. అంద‌రూ గంగ‌వెర్రులెత్తుతారు.

ఇక్క‌డ ఒక విష‌యం గుర్తుకు వ‌స్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ క‌ర్నూల్‌లో మాట్లాడుతూ.. హిందుమ‌తాన్ని, హిందూ దేవత‌ల‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడారు. ఏ ఒక్క‌రు ఖండించ‌లేదు. ఒక ముస్లిం చిత్ర‌కారుడు.. స‌రస్వ‌తి దేవిని న‌గ్నంగా చిత్రీక‌రించాడు. ఏ ఒక్క‌రూ ఖండించ‌లేదు. మొన్న‌టికి మొన్న సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కేర‌ళ‌లో అయ్య‌ప్ప‌స్వామిని దారుణాతిదారుణంగా అవ‌మానించింది. న‌గ్నంగా ఉన్న మ‌హిళ కాళ్ల మ‌ధ్య‌లో అయ్య‌ప్ప త‌ల‌ను చిత్రీక‌రించి.. పోస్ట‌ర్లు అతికించారు. ఏ రాజ‌కీయ పార్టీ ఖండించ‌లేదు. ఇదే భార‌త‌దేశంలోని రాజ‌కీయ పార్టీల లౌకిక‌వాదం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here