Home breaking news ఇది నువ్వు నేర్పిన విద్యయే / Chirumarti Join to Trs

ఇది నువ్వు నేర్పిన విద్యయే / Chirumarti Join to Trs

163
0

ఏమిరా ఇలా చేశావ్..? అంటూ ఎనకటికీ ఒకడు తన మిత్రుడిని అడిగాడట.. వాడు చెప్పిన సమాధానం విని ఆడిగినోడికి తలకాయ తిరిగిపోయింది. ఇంతకు వాడు ఏం చెప్పడంటే.. నువ్వు చేసిందే నేనూ చేశానంటూ ఇది నువ్వు నేర్పిన విద్యయే అని చెప్పాడంట. ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ ఎస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నాడని, దానికి సీఎం కేసీఆర్ అనుమతి కూడా ఇచ్చాడని కథనాలు వచ్చాయి. దీంతో ఆయనకు టికెట్ ఇప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అత్యంత బాధతో చిరుమర్తి ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని అనికోలేదు. అని అన్నాడు. కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి తాను ఏం చేశాడో గుర్తుకు తెచ్చుకోవడం అత్యవసరం. 2014 ఎన్నికల్లో ఈయన చేసిన గ్రూప్‌ రాజకీయాల కార‌ణంగా న‌ల్ల‌గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఓడిపోయారు. భువ‌నగిరి లోక్‌స‌భ స్థానంలో ఎంపీగా పోటీ చేసిన కోమ‌టిరెడ్డి.. ఎంపీగా త‌న‌కు ఓట‌యాల‌ని ప్రచారం చేసుకొని.. ఎమ్మెల్యేగా మాత్రం త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు వేసేట్టుగా చేశాడు. ఈ కార‌ణంగా కాంగ్రెస్ త‌రుపున పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఈయ‌న కూడా ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ విష‌యానికొస్తే.. ఆ పార్టీలో ఉంటూనే.. పార్టీకి వ్య‌తిరేకంగా ఎన్నిమార్లు మాట్లాడ‌లేదు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని ఏ స్థాయిలో విమ‌ర్శించారో అంద‌రికీ తెలుసు. పార్టీలో ఉంటూనే.. వ్య‌తిరేకంగా ప‌ని చేసిన కోమ‌టిరెడ్డి.. ఇప్పుడు చిరుమ‌ర్తి ద్రోహం చేశారంటూ వ్యాఖ్యానించ‌డం ఏమిటీ..? ఇదంత స‌రే కానీ.. అస‌లు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అనుమ‌తితోనే.. చిరుమ‌ర్తి టీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇదే నిజ‌మైతే..కోమ‌టిరెడ్డి సోద‌రులు కూడా టీఆర్ఎస్‌లోకే వెళ్తారు. అయితే వీరిద్ద‌రి రాక‌ను నల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి వ్య‌తిరేకిస్తున్న ప్ర‌చారం ఉండ‌నే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here