తెలంగాణలో ఘాటు లేకుండా పోయింది. ఉంటే గింటే అది కూడా కేసీఆర్ కామెంట్సే ఘాటుగా ఉంటాయి. ఇంకొకరు మాట్లాడరు. మాట్లాడిన అది పేపర్లో రాదు. రాస్తే గీస్తే ఒకే ఒక్క ‘వెలుగు’ పేపరే. ఈ పేపర్ ఎన్నిండ్లలో వెలుగుతుందో ఇంకా క్లారిటీ లేదు. వెలుగు ఇంటికే చెందిన ‘వీ 6’ ఛానల్ మాత్రం రాత్రి 9.30కి చానా ఇండ్లలో తీన్మార్ ఘాటు నింపుతోంది. పెద్ద పేపర్లుగా ఉన్న వాటిల్లో కన్పించని ఒక న్యూస్ ‘వెలుగు’లో కన్పించింది. అదే ‘త్వరలో మార్కెట్లోకి కేసీఆర్ మసాలా’ అన్న న్యూస్.
దీని సారాంశమేమిటంటే.. మార్కెట్లో తినే వస్తువులన్నీ కల్తీ అవుతున్నాయి కాబట్టి.. మహిళా సంఘాలతో వంటింటి మసాలా తయారు చేయాలన్న ఆలోచన చేస్తున్నరు. తయారు చేసిన వస్తువులన్నింటిని ‘కేసీఆర్’ పేరు పెట్టే ఆలోచన ఉందంట. వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేస్తారు. సప్లయ్ చేయడానికి రేషన్ షాపులుండనే ఉన్నాయి. ఇవి తీసుకుంటేనే బియ్యం అంటే సరే. జనాలు కొనకపోతే ఏం చేస్తరు. ఇదే జరిగితే.. వచ్చే ఏడాది మన వంటింట్లో కేసీఆర్ ఘాటు వస్తుంది.
ఇంతకీ వీళ్లకు ఎందుకాలోచన వచ్చిందంటే.. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో.. ఆహారంలో కల్తీ చేస్తున్నరని కేసీఆర్ సీరియస్గా కోప్పడ్డరుగా అందుకు. సరే ఇప్పటికే ఇంటికి పింఛన్, బియ్యం వచ్చేశాయి. ఆళ్లు చెప్పింది చూస్తే కేసీఆర్ మసాలా వస్తదేమో.? ఉద్యోగం లేని పోరగాండ్లకు పింఛన్ ఇస్తే అది కూడా వస్తుంది. మొన్న యాదగిరిగుట్ట రాళ్లపై కేసీఆర్ బొమ్మ పెట్టారు. కానీ ప్రతిపక్షపోళ్లకు ఏం పనిలేనట్టు కేసీఆర్ బొమ్మపై లొల్లి లొల్లి చేసిరి.. చివరాఖరుకు తీసేసిండ్రు. లేకుంటే నర్సింహస్వామి దర్శనం కంటే ముందో తరువాతో కేసీఆర్ స్వామి దర్శనం చేసుకునేటోళ్లం.