Home breaking news ఇక్క‌డ అధికారంలో ఉన్న‌ది.. ముఖ్య‌మంత్రి కూడా త‌మ‌రే మహాప్ర‌భో

ఇక్క‌డ అధికారంలో ఉన్న‌ది.. ముఖ్య‌మంత్రి కూడా త‌మ‌రే మహాప్ర‌భో

183
0
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి

ప్ర‌స్టేష‌న్‌లో ఉన్నోళ్లు తామేంటో తామే మ‌రిచిపోతుంటారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతుంటారు. ఆ త‌రువాత వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేసినా.. వివ‌ర‌ణ ఇచ్చినా.. పెద్ద‌గా ఫ‌లిత‌ముండ‌దు. ఇప్పుడు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి(జేడీఎస్‌) కూడా ప్ర‌స్టేష‌న్లోనే ఉన్నారు. సీఎం కుర్చీపై కూర్చున్నా అది ముళ్ల‌మీద కూర్చున్న‌ట్టే ఉన్న‌ట్టుంది.

మిత్ర‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ అన్ని తిప్ప‌లు పెడుతోంది. ఒక ప‌క్క మిత్ర‌ప‌క్షం తిప్ప‌లు పెడుతుంటే.. మ‌రోప‌క్క బీజేపీ నుంచి రోజుకో స్టేట్‌మెంట్. త‌మ చేతికొచ్చిన అధికారాన్ని జేడీఎస్‌, కాంగ్రెస్ క‌లిసి లాక్కున్నార‌ని ర‌గిలిపోతోంది. అందుకే ఈ ప్ర‌భుత్వాన్ని కూలుస్తామంటూ ఆ పార్టీ నేత‌లు త‌ర‌చూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో పాపం కుమార‌స్వామికి ఊపిరాడుతున్న‌ట్టు లేదు. అందుకే తానే ముఖ్య‌మంత్రిని.. ఇక్క‌డ అధికారంలో ఉన్న‌ది తానే అన్న సంగ‌తి మ‌రిచిపోయారో..? లేకుంటే అత్త‌మీద కోపం దుత్త‌మీద తీసిన‌ట్టు ఎక్క‌డి కోప‌మో కార్మికుల మీద తీర్చేసుకున్నారు. ఆ త‌రువాత నాలుక్క‌రుచుకొని.. అబ్బే అన్న‌ట్టుగా మాట్లాడారు.

విష‌య‌మేమిటంటే. . యర్‌మరస్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌), తుంగభద్ర స్టీల్స్ కంపెనీల నుంచి కాంట్రాక్టు కార్మికులను తొల‌గించారు. దీంతో వారు త‌మ‌కు మ‌ళ్లీ ఉద్యోగాలు ఇప్పించాలంటూ ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ప‌ల్లెనిద్ర‌లో భాగంగా.. ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి.. రాయ‌చూరు జిల్లా క‌రేగుడ్డ గ్రామానికి వెళ్తున్న సీఎంకు విన‌తిప‌త్రం వ‌చ్చేందుకు తొల‌గించిన కార్మికులు వ‌చ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవ‌డంతో.. కార్మికులు బ‌స్సును అడ్డుకున్నారు. అస‌లే ప్ర‌స్టేష‌న్లో ఉన్న కుమార‌స్వామికి స‌ర్రున కోపం వ‌చ్చి.. *ఏం త‌మాషాగా ఉందా..? ఓట్లు న‌రేంద్ర‌మోదీకి వేసి.. స‌మ‌స్య‌లు మాకు చెబుతారా..? బ‌స్సుకు అడ్డం త‌ప్పుకుంటారా..? లాఠీచార్జ్ చేయించాలా..? * అంటూ విరుచుక‌ప‌డ్డారు.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కుమార‌స్వామి వైఖ‌రిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో.. సీఎం వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. వైటీపీఎస్ కార్మికుల విష‌యంలో కార్మిక సంఘాల నాయ‌కుల‌తో తాను చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని, 15 రోజుల స‌మ‌యం కూడా అడిగాన‌ని.. ఉద‌య‌మే చ‌ర్చ‌లు జ‌రిపా.. అప్పుడే అడ్డుకుంటే ఎలా..? అని ప్ర‌శ్నించారు. క‌డుపు ఎండినోడికి చ‌ర్చ‌లు గిర్చ‌లు ప‌ట్ట‌వు. స‌మ‌స్య ప‌రిష్కార‌మైందా..? లేదా అన్న‌దే ముఖ్యం. అన‌డం త‌ర్వాత వివ‌ర‌ణ ఇవ్వ‌డం కంటే.. కార్మికులు వ‌చ్చిన‌ప్పుడే కాన్వాయ్ ఆపి ఇప్పుడు చెప్పిన ముచ్చ‌టే అప్పుడే మైకులో చెప్పి ఉంటే.. ఎలా ఉండేదో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here