Home తాజా వార్తలు ఇందుకేనేమో.. కమ్యూనిస్టుల బలం దేశంలో తగ్గిపోయింది

ఇందుకేనేమో.. కమ్యూనిస్టుల బలం దేశంలో తగ్గిపోయింది

89
0

ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటామంటున్న కమ్యూనిస్టు పార్టీల బలం రోజు రోజుకు ఎందుకు తగ్గిపోతోందో..? ఇప్పటివరకూ అర్థంకాని వాళ్లకు కూడా ఇప్పుడు కరెక్ట్​గా అర్థమైపోయింది. తెలంగాణలోని ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకులు… ఒక పక్క మద్దతుగా నిలబడతామంటూనే..ఇంకో పక్క పోరాటం చేస్తామంటోంది. ఇది భిన్నమైన విధానం కదా.? తెలంగాణలో హుజూర్​నగర్​ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ అభ్యర్థికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మద్దతు ప్రకటించింది. ప్రచారం కూడా చేస్తామంటోంది.

కారణాలు ఏవైనా.. ఒక నిర్ణయం తీసుకున్నారు. మద్దతిస్తున్నారు అనుకునే లోపలే.. అదే టీఆర్​ఎస్​పై పోరాటం చేస్తామంటోంది సీపీఐ పార్టీ. మద్దతు మద్దతే.. పోరాటం పోరాటమే అని చెబుతోంది. తెలంగాణలో అర్టీసీ వాళ్లు సమ్మెకు పిలుపిచ్చారు. బస్సులు అగిపోయాయి. సీఎం కేసీఆర్​కు కోపమొచ్చింది. ఆర్టీసీ కార్మికులందరూ మాజీలై పోయారు. వారు ఇక నుంచి ఆర్టీసీ కార్మికులు కారు అంటూ సీఎం ప్రకటించేశారు. ఆర్టీసీ సమ్మెలో సీపీఐ అనుబంధ సంఘం ఎంప్లాయిస్​ యూనియన్​ (ఏయూ) కూడా భాగస్వామి. ఈ సంఘంలోని కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు.

ఇప్పుడు సీపీఐ ఏం చెబుతుందంటే.. హుజూర్​నగర్​లో మద్దిస్తున్నాం. అక్కడ మద్దతే. కానీ ఆర్టీసీ సమ్మె విషయంలో టీఆర్​ఎస్​పై పోరాటం చేస్తామని ప్రకటించింది. సీఎం కేసీఆర్​ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. హుజూర్​నగర్​లో కేసీఆర్​ ప్రజాస్వామ్యవాది.. ఆర్టీసీ సమ్మెలో మాత్రం నియంతృత్వమా..? ఇదే వైఖరి. అందుకేనేమో.. కమ్యూనిస్టు పార్టీలు దేశంలో బలహీనమై పోయాయని జనం అనుకుంటున్నరు. ఇందులో వాస్తవం కూడా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here