Home ఎడ్యుకేషనల్/జాబ్స్ ఇండియ‌న్ కోచ్ ఫ్యాక్ట‌రీ (ఐసీఎఫ్‌) లో 992 ఖాళీలు

ఇండియ‌న్ కోచ్ ఫ్యాక్ట‌రీ (ఐసీఎఫ్‌) లో 992 ఖాళీలు

257
0

చెన్న‌య్ః ఖాళీగా ఉన్న పోస్టుల‌కు భారత రైల్వే మంత్రిత్వ శాఖ అర్హులైన వారి నంచి ద‌ర‌ఖాస్తులు కోరుతూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన చెన్న‌య్‌లోని ఇండియ‌న్ కోచ్ ఫ్యాక్ట‌రీలోని వివిధ విభాగాల్లో 992 అప్రెంటీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వివిధ విభాగాల వారీగా ఖాళీలుః వెల్డ‌ర్‌-290, కార్పెంట‌ర్-80, ఎల‌క్ట్రిష‌న్‌-200, ఫిట్ల‌ర్‌-260, మిషినిస్ట్-80, పెయింటర్‌-80, పాసా-2
అర్హ‌తః 10+2 (సైన్స్ అండ్ మ్యాథ్స్‌) ఉత్తీర్ణ‌త‌తో పాటు ద‌ర‌ఖాస్తు చేసుకునే పోస్టుకు ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి. 1 అక్టోబ‌ర్ 2019 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య‌ వ‌య‌సుండాలి. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు ఉంటుంది. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు రుసుంః 100, అక‌డ‌మిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 24 జూన్ 2019 తేదీ నాటికి అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు https://icf.indianrailways.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here