Home breaking news ఆ సర్వేలో కేసీఆర్ ఊసే లేదంట.. జగన్ పేరు మాత్రం ఉంది సుమా

ఆ సర్వేలో కేసీఆర్ ఊసే లేదంట.. జగన్ పేరు మాత్రం ఉంది సుమా

122
0

ఏ సర్వే చూసినా.. కేసీఆర్​ పేరు మాత్రం ఏదో ఒక స్థానంలో కన్పించేది. కానీ ఈ సర్వేలో మాత్రం కేసీఆర్​ ఊసే లేదంట. ఐదో ర్యాంక్​ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక్కడి వరకూ కేసీఆర్​ లేదు. ‘మూడ్​ ఆఫ్​ దీ నేషన్​’ పేరుతో ఇటీవల ఇండియా టుడే‌‌ – కార్వీ సర్వే నిర్వహించింది. అన్నిసర్వేల్లో మాధిరిగానే. దీనిలో కూడా ప్రధానమంత్రి మోదీ పేరు మార్మోగిపోయింది. ఆయన పాలన బాగుందని దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో పాల్గొన్న 12,126 మంది 71 శాతం జై కొట్టారు. ఇటీవల మోదీ తీసుకున్న నిర్ణయాలన్నింటిని ఈ సర్వేలో అత్యధికులు సమర్ధించారు. ట్రిపుల్​ తలాక్​ను కూడా సమర్ధించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.

ముఖ్యమంత్రుల విషయం వచ్చే సరికి బెస్ట్​ ముఖ్యమంత్రి ఎవరంటే.. యోగి ఆదిత్యనాథ్​ పేరు మొదటి స్థానంలో ఉంది.  రెండో స్థానంలో నితీశ్​కుమార్​, మూడో స్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా ముఖ్యమంత్రులు ఫడ్నవీస్​, కేజ్రీవాల్​ నవీన్​ పట్నాయక్​.. ఇక నాలుగో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ ఉన్నారు. ఐదు స్థానానికి వస్తే  బెంగాల్​ టైగర్​ మమతా బెనర్జీ దక్కించుకున్నారు. చిత్రమేమిటంటే.. అన్ని సర్వేల్లో ఆ మధ్య ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో కూడా కేసీఆర్​ పేరు పేలిపోయింది. కానీ ఈ సర్వేలో కేసీఆర్​ ఊసే లేదు. కేసీఆర్​ పేరు లేకపోవడం విచిత్రమే. కేసీఆర్​ అభిమానులను ఈ సర్వే గురించి అడిగితే మాత్రం నరేంద్రమోదీ కావాలనే కేసీఆర్​ పేరు రాకుండా చేశారంటూ కారు డిక్కి మీద దరువేసి మరీ చెబుతారు. ఇందులో మాత్రం ఎటువంటి డౌటు లేదు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here