Home breaking news ఆ ఒక్క సినిమాను కేసీఆర్ ఎన్నిమార్లు చూశారో తెలుసా.?

ఆ ఒక్క సినిమాను కేసీఆర్ ఎన్నిమార్లు చూశారో తెలుసా.?

235
0
ఆ ఒక్క సినిమాను కేసీఆర్ ఎన్నిమార్లు చూశారో తెలుసా.?

ఎవరైనా ఒక సినిమాను ఒకసారో రెండుమార్లో మరీ నచ్చితే మరో రెండుమార్లు చూస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రం ఆ ఒక్క సినిమాను ఎన్నిమార్లు చూశారో తెలిస్తే మనమూ ఆశ్చర్యపోక తప్పదు. ఆ ఒక్క సినిమాను కేసీఆర్​ 25 మార్లకు పైగా చూశారంట. అదే స్థాయిలో మరికొన్ని సినిమాలు కూడా చూశారంట. ఇంతకీ ఆయన 25 మార్లు చూసిన సినిమా ఏంటంటే శంకరాభరణం. ఈ మాట కేసీఆరే స్వయంగా చెప్పిన మాట. ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్​ ఇంటికి కేసీఆర్​ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో మాట ముచ్చట చెప్పారు. తాను నీ అభిమానినంటూ చెప్పుకున్నారు. శంకరాభరణం సినిమాను తాను 25 మార్లకు పైగా చూసినట్టు కేసీఆర్​ చెప్పారు. మిగిలిన సినిమాలు కూడా అదే స్థాయిలో చూశానని చెప్పుకున్నారు. వీలు దొరినప్పుడల్లా మీ సినిమాలే చూస్తనంటూ చెప్పుకొచ్చారు. ఎన్నో మంచి సినిమాలు తీసిన మీ​ దర్శకత్వంలో మరో సినిమా రావాలని విశ్వనాథ్​ను కేసీఆర్​ కోరారు. అవసరమైతే సినిమాకు తానే నిర్మాతగా ఉంటానని కూడా కేసీఆర్​ చెప్పారు. త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తుంది అని విశ్వనాథ్​కు కేసీఆర్​ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here