Home breaking news ఆల్మ‌ట్టిలో క‌ల‌వ‌ద్ద‌ని చూస్తుంటే.. గోవాలో కాంగ్రెస్ పుట్టి మునిగింది – బీజేపీలో విలీన‌మైన సీఎల్పీ

ఆల్మ‌ట్టిలో క‌ల‌వ‌ద్ద‌ని చూస్తుంటే.. గోవాలో కాంగ్రెస్ పుట్టి మునిగింది – బీజేపీలో విలీన‌మైన సీఎల్పీ

179
0
రాజీనామాల‌ను స్పీక‌ర్‌కు అందిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (ఫొటోః ఇంట‌ర్‌నెట్ నుంచి)

పార్టీ ప‌రువు క‌ర్ణాట‌క‌లోని ఆల్మ‌ట్టి డ్యామ్‌లో మున‌గ‌కుండా ప్ర‌య‌త్నిస్తుంటే.. ఏకంగా గోవాలో కాంగ్రెస్ పుట్టి మునిగిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి.. ఏకంగా బీజేపీలో చేరిపోయారు. క‌ర్ణాట‌క‌లోని సంకీర్ణ స‌ర్కార్‌పై కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన‌ 14 మంది ఎమ్మెల్యేలు ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి తిరుగుబాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది.. స‌ర్కార్‌ను గాడిన ప‌డేయ‌డానికి కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో గోవా కాంగ్రెస్ శాస‌న‌స‌భ ప‌క్ష‌నేత స‌హా ఎమ్మెల్యేలు 10 మంది తిరుగుబాటు చేశారు. అసెంబ్లీ స్పీక‌ర్ ర‌మేశ్ ప‌ట్నాక‌ర్‌కు తాము కాంగ్రెస్‌కు రాజీనామాలు చేసిన‌ట్టు తెలిపారు. ఆ త‌రువాత బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్షంలో విలీన‌మ‌య్యారు.

ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్‌కు 15 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా.. 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డంతో.. 5గురు మిగిలారు. బీజేపీకి 27 మంది స‌భ్యులున్నారు. 2017లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల స‌మయంలో 40 మంది సీట్లు ఉన్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ 17 స్థానాలు గెలుచుకొని పెద్ద పార్టీగా నిలిచింది. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన కార‌ణంగా 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీ చిన్న పార్టీల‌ను క‌లుపుకొని స‌ర్కార్‌ను ఏర్పాటు చేసింది. ఆ త‌రువాత కాంగ్రెస్‌కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బ‌లం 17కు చేరింది. ఇప్పుడు 10 కాంగ్రెస్ స‌భ్యుల చేరిక‌తో 27కు చేరింది. బీజేపీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here