Home breaking news ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమ‌లింగం

ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమ‌లింగం

294
0
మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి
  • వికాస్ రుషి

ఎన‌క‌టికి పెండ్లికాని ఒక‌డు.. నాకు కొడుకు పుడితే సోమ‌లింగం అని పేరు పెట్టుకుంటాన‌ని చెప్పాడంట‌. ఈ ముచ్చ‌టిన్న ఓ పెద్దాయన న‌వ్విఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అని ఎట‌కార‌మాడిండంట‌. ఇప్పుడు రాజ‌గోపాల్ రెడ్డి అన‌బ‌డే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముచ్చ‌ట కూడా అట్ల‌నే ఉంది. బీజేపీ అధికారంలోకి వ‌స్తే నేనే ముఖ్య‌మంత్రిని అని ఓ కార్య‌క‌ర్త‌తో ఫోన్లో చెప్పుకున్నడంట‌. అది బ‌య‌ప‌డ్డ‌ది.

ఎంపీ టూ ఎమ్మెల్యే వ‌యా ఎమ్మెల్సీ అయినా ఈ రాజ‌గోపాల్‌రెడ్డి ఇంకా కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నాడు. పోయినేడాది నుంచే ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని మార్వండి. మా ఇద్ద‌రిలో (వెంక‌ట‌రెడ్డి) ఒక‌రిని టీపీసీసీ అధ్య‌క్షుడిగా చేయండి. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే పూచి నాది అని అధిష్టానం వ‌ద్ద ఎన్నిమార్లు చెప్పుకున్నా.. ఈళ్ల మాట‌లు సాగ‌లేదు. ఉత్త‌మ్ నాయ‌క‌త్వంలోనే ఎమ్మెల్యే, ఎంపీ ఎల‌క్ష‌న్లు జ‌రిగినయి. జ‌ర‌గాల్సిన న‌ష్టమూ జ‌రిగింది. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో న‌ష్టం జ‌రిగిన‌ట్టుగానే.. తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది.

సాక్షాత్తు రాహుల్‌గాంధే ఓడిపోంగా లేంది. తెలంగాణ‌లోని నాయ‌కులు ఒక‌లెక్కా..? ఎల‌క్ష‌న్లు అయిపోయికాన్నుంచి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ స‌ణుగుడు మొద‌లైంది. మాకి అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే ఇట్ల‌గాక పోవును. గెలిపించేటోళ్లం. కాంగ్రెస్‌ల పెద్ద త‌ల‌కాయ‌లే కేసీఆర్‌తో మిలాఖ‌త్ అయిండ్రు సణిగేదీ స‌ణుగుకుంట‌నే.. రాజ‌గోపాల్‌రెడ్డి.. బీజేపోళ్ల‌తో చ‌ర్చ‌లు షురూ చేయ‌నే చేసే.. రేప్రేపు టీఆర్ఎస్‌కు బీజేపీ ధీటుగా నిలుస్తదంటూనే.. నేను ఏ పార్టీల‌కు పోయేదీ మీకే చెప్తా.. అంటూ ఇలేఖ‌ర్ల‌తో ముచ్చ‌ట పెట్టే.

కాంగ్రెస్‌లో మిగిలిన అడుగుబొడుగు ఎమ్మెల్యేలు.. మాజీ ఎంపీల‌తో చ‌ర్చ‌లు చేయ‌బ‌ట్టే.. బీజేపీల‌కు రాండ్రి అని పిల‌వ‌బ‌ట్టే. నేను ఒక్క‌డినే ఎందుకు పోతా.. నాతోటి ఇంకొంద‌రిని తీసుకొని పోతే.. బ‌ల‌ముంట‌ది అనుకున్న‌ట్టుండు అందుకే మాట్లాడింటూ. ఈ ముచ్చ‌ట వ‌ర‌కూ బాగానే ఉంది క‌ని.. త‌న‌కు బాగా దోస్తున్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌తో ఈ ముచ్చ‌టంతా చెప్పుకుంట‌.. రేప్రేపు.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చింద‌నుకో నేనే ముఖ్య‌మంత్రిని అని చెప్పాడంట‌.

ఆ కార్య‌క‌ర్త ఈ ముచ్చ‌టంత రికార్డు చేయ‌నే చేసే.. బ‌య‌ట‌కు రానే వ‌చ్చే. ఈ ముఖ్య‌మంత్రి మాట ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగంలానే ఉంది. ఇప్ప‌డు బీజేపీకి ఉన్న‌దే ఒక్క ఎమ్మెల్యే. 2023 నాటికి ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చే స్థాయికి రాగ‌లుగుతుందా..? వ‌చ్చిందే అనుకో.. బీజేపీల ఎంత‌మంది సీనియ‌ర్లు లేరు. నిన్నెందుకు ముఖ్య‌మంత్రి కుర్సీ మీద కూచోబెడ‌త‌రు గానీ ఊరుకో రాజ‌గోపాల్‌రెడ్డి మ‌ళ్ల‌నేవు. న‌వ్వుకుంటుండ్రు అంద‌రూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here