Home తాజా వార్తలు ఆర్టీసోళ్ల మీద పక్కోడికున్న సానుభూతి, దయ ఇక్కడోళ్లకు లేదంట

ఆర్టీసోళ్ల మీద పక్కోడికున్న సానుభూతి, దయ ఇక్కడోళ్లకు లేదంట

154
0

పాలోళ్ల పగ లాంటిదే తెలంగాణ, ఏపీ మధ్య కన్పించేదీ. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు.. విడిపోయిన కొత్తలో సై అంటై సై అన్నట్టుగా అన్పించేదీ. ఐదేళ్లయిందిగా.. ఎవరి ఆస్తులు వారు పంచుకున్నరు. కొన్ని ఉన్నా.. వాటిని ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటున్నరు. మొన్నటి ఎన్నికల తర్వాత అప్పుడున్నంత కోపతాపాలు ఇప్పుడు తెలంగాణ, ఏపీ మధ్య కానరావడం లేదు. దానికి నిదర్శనమే.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆంధ్ర ఆర్టీసోళ్లు మద్దతు పలకం. కనీసం కార్మికులు కార్మికులు ఒకటన్న ఫీలింగ్​తో మద్దతు పలికారు. ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ గవర్నమెంట్​ చూపిస్తున్న కోపాన్ని ఆంధ్ర కార్మికులు కూడా ఖండించేశారు.

ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి.. ‘గూండాగిరి’ అంటూ సీఎం కేసీఆర్​ ఇచ్చిన స్టేట్​మెంట్​, ఖమ్మం డ్రైవర్​ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో 19న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర బంద్​కు పిలుపు ఇచ్చిందిగా.. ఆ రోజు ఏపీ ఆర్టీసోళ్లు ఎర్ర బ్యాడ్జీలు పెట్టుకొని బస్సులు నడుపుతమని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ టైంలో ఇక్కడోళ్లు వాడిన భాషను ఆళ్లు గుర్తుకు పెట్టుకుంటే.. ఇట్ల మద్దతీయక పోదురు. ఆయళ్ల.. ఉన్న పరిస్థితి అలాంటిది. అంటే అన్నరులే మనోళ్లే (కార్మికులే) కష్టంల ఉన్నరని ఆంధ్రోళ్లు మద్దతుగా నిలబడ్డరు. ఆళ్లు మద్దతిస్తున్న ముచ్చటిన్న తెలంగాణోళ్లు.. ఒకటే మాటంటున్నరు. పక్కోడికున్న సానుభూతి, దయ మనోడికి లేదని. ఈ మాట ఎవరిని ఉద్దేశించి అన్నట్టని ఎంటికలు పీకేసుకోకుర్రి.. ఎవరిని అంటున్నరో దాదాపు అందరికీ అర్థమైపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here