Home breaking news ఆర్టీసీ సమ్మె.. అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు తప్పా..? కేసీఆర్

ఆర్టీసీ సమ్మె.. అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు తప్పా..? కేసీఆర్

77
0

తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన సకల జనుల సమ్మె కరెక్ట్​ అన్నప్పుడు ఇప్పుడు ఎలా తప్పవుతుందని కాంగ్రెస్​ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక, దుర్మార్గమైన పాలన సాగుతుతుందని, ప్రజలకు హక్కులు లేకుండా హరించి వేస్తున్నారని, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్మాయం చాలా అణలోచితమైన, దుర్మార్గమైన, చట్ట విరుద్ధమైన చర్య అని విమర్శించారు. సమ్మె చట్ట విరుద్ధమని కేసీఆర్ అంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో సకల జనుల సమ్మె చేయనివ్వకపోతే అసలు తెలంగాణ వచ్చేదా అని అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఉద్యమ సమయంలో కేసీఆర్, ఆర్టీసీ ఉద్యమాల గురించి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు తెప్పించుకుని చూడాలని సూచించారు. ప్రతిపక్షంలో ఒక రకంగా అధికారంలోకి వచ్చాక ఒక రకంగా మాట్లాడడం ఆయనకే చెల్లిందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ లో ప్రభుత్వ ఉద్యోగులను కుక్క తోకతో పోల్చరని, రెవెన్యూ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసే విదంగా ప్రకటనలు చేసారని, విఆర్వో వ్యవస్తను రద్దు చేస్తామని అంటున్నారని ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎలాంటి గౌరవ, మర్యాదలు లేవని ఆయన అన్నారు. ప్రభుత్వ అన్ని శాఖల ఉద్యోగులు, సంఘాలు చాలా ధైర్యంతో ప్రభుత్వం పైన ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయాలని తాము ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.   

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశం ప్రతి పౌరునికి హక్కులు ఉంటాయని, ప్రభుత్వం హక్కులు కాలరాసే విదంగా అనుసరించకుండా, ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని సూచించారు. కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరియించాలని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని ప్రజాస్వామ్యా డిమాండ్లు ఒప్పుకొని ప్రజలు పడుతున్న రవాణా ఇబ్బందులను పరిష్కరించాలని ఆయన అన్నారు. పండుగ పూట ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులకు అండగా నిలవాలని మద్దతు ప్రకటించి సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here