Home breaking news ఆర్టీసీ పులి మీద సవారీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఆర్టీసీ పులి మీద సవారీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

299
0
ఊహాత్మక చిత్రం

ఆర్టీసీ అనే పులి మీద ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్​ సవారీ చేస్తున్నారు. దిగనని భీష్మించుకొని కూర్చున్నాడు. నెల ముందు ఆర్టీసోళ్లు తమ డిమాండ్లు నెరవేర్చాలని నోటిసిచ్చారు. అనేక డిమాండ్లలో ఆర్టీసీని సర్కారులో విలీనం చేయాలన్న డిమాండ్​ ఉన్నది. ఇట్లనే నోటీసిస్తరు. గట్లనే చల్లారుతుదని పట్టించుకోలేదు. ఐదో తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నామని ప్రకటించారు. అయినా కేసీఆర్​ పట్టించుకోలేదు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్​ ఉన్నా.. ఆయన చేతిలో ఏముంది పట్టించుకోవడానికి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నానని సీఎం కేసీఆర్​ మూడో తేదీ రాత్రి ఢిల్లీకి పోయిండు. నాలుగోతేదీన ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ను కలిసిండు. వారి నుంచి ఎలాంటి సానుకూలత రానట్టుంది. రాత్రిరాత్రే వచ్చేసిండు. సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు ప్రకటిస్తే.. ఎస్మా ప్రయోగిస్తామని మంత్రి హెచ్చరికలు. సాయంత్రానికి డ్యూటీలోకి రాకుంటే.. కుదరంటూ ప్రకటనలు.

మంత్రి ఇటువంటి ప్రకటనలు చేసినా.. కేసీఆర్​ నుంచి కొంత సానుకూలత ఉంటుందని కార్మికులు అనుకున్నారు. కానీ.. కేసీఆర్​ నుంచి మరింత ఘాటుగా ప్రకటన వచ్చింది. విదులకు హాజరుకానీ వారందరూ సెల్ఫ్​ డిస్మిస్​ అయినట్టే అని. బెదిరి విదులకు హాజరవుతారని కేసీఆర్​ అనుకున్నడు. కానీ కార్మికులు వెనక్కి తగ్గలేదు ముందుకే వెళ్లారు. అప్పుడన్న ఏదో ఒక స్థాయిలో చర్చలు జరిపించినట్టయితే.. జనం నుంచి కేసీఆర్​పై వ్యతిరేకత రాకపోవును. చర్చల్లేవు గిర్చల్లేవు అంటూ మళ్లీ హెచ్చరికలు. ఇప్పుడు  జనం నుంచి వ్యతిరేకత మొదలైంది. సమ్మె వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. మొదట సున్నితంగానే న్యాయమూర్తులు సమ్మె పరిష్కార దిశగా కృషి చేయండని సూచించారు. చర్చలు జరపాలన్నారు. ఎండీని నియమించాలని చెప్పారు. కార్మికులు పిల్లల్లాంటి వారు.. వారిపై తండ్రి కోప్పడకూడదని హితవు పలికారు. మధ్యవర్తిత్వం వహించడానికి ఎంపీ కేశవరావు కూడా ముందుకు వచ్చారు. ఈ స్థాయిలో కేసీఆర్​ ఒక మెట్టుదిగి.. చర్చలు జరిపి ఉంటే.. సమ్మె సమస్య పరిష్కారమయ్యేది.

బస్సులు మొత్తం నడిపిస్తున్నామని.. కార్మికులతో చర్చల్లేవంటూ కేసీఆర్​ హూంకరించారు. తాత్కాలిక సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్​ కూడా వేశారు. మూడోసారి విచారణలో కోర్టు సర్కారు కొంత సీరియస్​గానే స్పందించింది.  జనం తిరగబడితే ఎవరేం చేయలేరు. పరిస్థితిని చక్కదిద్దండి, చర్చలు జరపండి అంటూ హితవు పలికింది. తాము చర్చలకు సిద్ధమేనని కార్మికులు ముందుకొచ్చారు. ఈ దశలో కేసీఆర్​ ముందుకు వచ్చి ఉంటే.. ఆర్టీసీ సమ్మె అనే పులి మీద కేసీఆర్​ చేస్తున్న సవారీకి మంచి ముగింపు వచ్చేదీ. కానీ కేసీఆర్​ భీష్మించుకొని కూర్చున్నారు. చర్చల ప్రసక్తే లేదన్నారు.  కార్మికులు సమ్మె ఆపితేనే చర్చలన్నారు. రాష్ట్రంలో బంద్​ విఫలయం చేయండని పోలీసులను ఆదేశించారు.

సమ్మె అనే పులిమీద నుంచి దిగిపోవడానికి వచ్చిన అవకాశాలను కేసీఆర్​ స్వయంగా దూరం చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు కూడా కేసీఆర్​ దిగే చాన్స్​ ఉంది కానీ దిగితే తన అహం దెబ్బతింటుందని దిగకుండా ఆయన భింకంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్​ దిగకున్నా.. పులి దింపేస్తది. కాకుంటే ఫలితం వేరే ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. నేను అనుకున్నదే జరగాలని అనుకునే కేసీఆర్​కు తప్ప.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here