Home breaking news ఆర్టీసీ కార్మికుల ఆవేశాన్ని చల్లార్చడానికే సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం

ఆర్టీసీ కార్మికుల ఆవేశాన్ని చల్లార్చడానికే సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం

87
0

ఆర్టీసీ కథ సుఖాంతమా..? దు:ఖాంతమా..? అన్నది పక్కన పెడితే  ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రం.. ఆర్టీసీ కార్మికులతో నేరుగా సమావేశమవుతారంట. అది కూడా డిసెంబర్​ 1న ప్రగతి భవన్​లో సమావేశం అవుతారని టీఆర్​ఎస్​ వర్గాలు ప్రకటించాయి. ఈ సమావేశం ఎందుకంటే.. ఆ ఏముంది వారికి మచ్చిక చేసుకోవడానికే అని ప్రచారం జరుగుతోంది. దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులను ఎన్ని అనాలో అన్ని ఎండీతో అనిపించారు. ఇప్పుడు సమ్మె విరమించినా.. వారంత కేసీఆర్​పై కోపంతోనే ఉండే అవకాశముంది. వారి ఆవేశాన్ని చల్లార్చడానికి ఈ సమావేశాన్ని కేసీఆర్​ ఏర్పాటు చేస్తున్నారని ప్రచారమైతే జరుగుతోంది. అయినా కేసీఆర్​ సంగతి తెలియందేముంది. ఆ మాటలు నేనన్నానా..? నేను మిమ్మల్ని ఆ మాటలు అనగలనా..? మీరంటే నాకు ప్రాణం అనే కేసీఆర్ అం​టారని చెప్పుకుంటున్నారు.

సరే విషయానికొస్తే..   రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి  ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఆహ్వానిస్తారు. వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఇన్​చార్జ్​  ఎండీని సీఎం కేసీఆర్​ ఆదేశించారు.  సమావేశానికి పిలిచే ఐదుగురిలో సామాజిక సమతుల్యత ఉండాలని ఇందులో  ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని ఆదేశాలు వెళ్లాయి.  డిసెంబర్ 1న మద్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని, వారికి ప్రగతి భవన్ లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నారు. ముందు భోజనం చేసిన తర్వాతే కేసీఆర్​ నేరుగా కార్మికులతో సమావేశమవుతారు. మాట్లాడుతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిస్తారని ఇప్పటివరకూ ఉన్న సమాచారం. అయితే ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్​ఎంలు, డీవీఎంలు కూడా హాజరవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here