Home breaking news ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ అందుకే వ్యతిరేకిస్తోందా..?

ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ అందుకే వ్యతిరేకిస్తోందా..?

54
0
ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ అందుకే వ్యతిరేకిస్తోందా..?
చిదంబరం

ఆర్టికల్​ 370 రద్దు, జమ్ము కశ్మీర్​ పునర్వ్యస్థీకరణపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. ఈ అంశంపై ఒకపక్క పాకిస్థాన్​.. బీజేపీపై మండిపడుతుంటే.. దాదాపు అదే స్థాయిలో కొందరు కాంగ్రెస్​ నేతలు మండిపడుతున్నారు. ఆర్టికల్​ రద్దుపై ఎప్పుడు విమర్శలు గుప్పిస్తున్న మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం బీజేపీని విమర్శిస్స్తూ.. పరోక్షంగా రద్దును తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా చెప్పేశారు. జమ్మూ కశ్మీర్​లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్నందునే.. ఆర్టికల్​ 370ని రద్దు చేసిందని విమర్శలు గుప్పించారు. హిందువులే మెజార్టీగా ఉంటే.. ఆర్టికల్​ 370 అంశాన్ని బీజేపీ తాకకూడా తాకేదీ కాదంటూ చెప్పుకొచ్చారు. ఆయ్యా చిదంబరం గారు.. మీరు బీజేపీనే విమర్శిస్తున్నానని అనుకుంటూ మీరెందుకు ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారో కూడా స్పష్టం చేసేశారు సుమా. ముస్లింలు ఎక్కువగా ఉన్నందునే.. ఆర్టికల్​ 370 రద్దు చేసిందని చెప్పారు సరే. బీజేపీ మొదటి నుంచి హిందుత్వ భావజాలమున్న పార్టీ అని అందరికీ తెలుసు. మొన్నటి ఎన్నికల్లో ముస్లింలకు ఎన్ని సీట్లు ఇచ్చిందో అందరికీ తెలుసు. లౌకికవాద పార్టీగా చెప్పుకుంటున్న మీరు (కాంగ్రెస్​) మాత్రం ముస్లింలకు మేమే అండ.. అందుకే 370 రద్దును వ్యతిరేకిస్తున్నమంటూ చెప్పకనే చెప్పేశారు.

వీడియో.. చిదంబరం ఫేస్​బుక్​ నుంచి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here