ఆర్ఎస్ఎస్ చెప్పిందే.. భారత ప్రధానమంత్రి మోదీ చేస్తున్నారని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని ఇమ్రాన్.. తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. రద్దు తర్వాత.. భారత్‌తో వాణిజ్యం తెగదెంపులు చేసుకోవడంతో పాటు గగనతలాన్ని కూడా మూసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్ వేధికగా తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. కశ్మీర్ స్వరూపాన్ని మార్చేందుకే ఆర్టికల్ 370 రద్దు చేశారని విమర్శలు గుప్పించారు. హిందూ ఆధిపత్య దోరణి కల్గిన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో మోదీ సర్కార్ పని చేస్తున్నదంటూ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంపై తాను కలత చెందుతున్నానని పేర్కొన్నారు. ముస్లింలను ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకొని వారిని అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే.. పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.