Home breaking news ఆయన లేకుండానే పార్టీ ఆవిర్భావం

ఆయన లేకుండానే పార్టీ ఆవిర్భావం

96
0

అనుకున్నట్టే జరిగింది. ఆయన లేకుండానే ఆవిర్భావ దినోత్సవం జరిగిపోయింది. పార్టీకి వెన్నుముకగా వ్యక్తి లేకుండా జరగడం ఏమిటని అనుకుంటున్నారా..? రాజకీయాల్లో సహజమే. పార్టీ ఏర్పాటు చేసిన అది నాయకుడిని తప్పించిన చరిత్ర మన రాజకీయ పార్టీలకు ఉన్నది. అద్వానీ గురించి అనుకుంటున్నారా..? ఇది ఎన్టీఆర్ ను ఉద్దేశించి. అద్వానీని తప్పించలేదు. 75 ఏళ్ళు వయసు దాటిన వారికి టికెట్లు ఇవ్వవద్దని పార్టీ నిర్ణయం ప్రకారం జరిగింది. ఎన్టీఆర్ విషయంలో అలా కాదు. పార్టీని చంద్రబాబు లాక్కున్నారు. సరే ఆయన లేకుండా పార్టీ ఆవిర్భావం విషయానికి వస్తే టీఆర్ ఎస్ కు వెన్నుముకగా నిలిచి.. పార్టీ విజయంలో పాలు పంచుకున్న వ్యక్తి. ఆయన లేకుండా టీఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ భవన్ లో జరిగింది. అన్నీ తానై కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ జెండాను అవిష్కరించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ వెంట ఇన్నేళ్లుగా నడిచిన కార్యకర్తలకు పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2001లో కేసీఆర్‌ ఒంటరిగా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారని గుర్తుచేశారు.
ఎంచుకున్న లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా.. రెండు సార్లు సీఎం అయిన ఘనత సీఎం కేసీఆర్‌ కు మాత్రమే సొంతం అన్నారు. పార్టీలో కార్యకర్తల సంఖ్య పెరిగిపోయిందని అందరూ సంయమనంతో ముందుకు సాగాలన్నారు.
పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిగా ఉండాలన్నారు. టీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here