Home జాతీయం ఆపరేషన్ కమల్.. కాదు *కర్నాటకం* కొత్త మలుపు.. సూత్రధారి ఎస్సారే

ఆపరేషన్ కమల్.. కాదు *కర్నాటకం* కొత్త మలుపు.. సూత్రధారి ఎస్సారే

280
0

ప్రేక్షకులు ఊహించని రీతిలో ట్విస్ట్ లు ఉంటే డ్రామా అయినా. సినిమా అయినా ఆదరణ పొందుతుంది. లేకుంటే ఎవ్వరూ చూడరు. మార్నింగ్ షోతోనే రీలు సారీ ఇప్పుడు చిప్ లు కదా తీసేస్తారు. అప్పట్లో 350 రోజుల వరకూ సినిమాలు నడిచేవి. ఇప్పుడు సినిమాలు వారం నడిస్తే సక్సెస్. గతేడాది విడుదలైన *కర్ణాటం* అనే పొలిటికల్ మూవీ మూడో శత దినోత్సవానికి పరుగులు తీస్తోంది. ఈ మూవీ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు చూపించిన బూచికి బదులు కొత్త బూచిని చూపిస్తోంది.. అదే ఎస్సార్. కథేంటో చూద్దాం. 

కర్ణాటకలో బీజేపీని అడ్డుకోవడానికి.. జత కట్టిన జేడీ(ఎస్), కాంగ్రెస్.. సంకీర్ణ సర్కారు చేశాయి. అప్పటి నుంచి అంటే డిసెంబర్ 2018 నుంచి.. కర్నాటకం లోని సంకీర్ణ లుకలుకలు అందరికీ వినోదం కలిగిస్తున్నాయి. రోజుకో ఎమ్మెల్యే ఎదురు తిరగడం.. ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను బుజ్జగించడం ఆ రోజుకు కథ సుఖాంతం కావడం జరిగి పోతోంది. ఈ పరిణామాల వెనుక బీజేపీ ఉందని సంకీర్ణ పక్షాలు ఆరోపించేవి కానీ ఇప్పుడు సీన్ మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తాను ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశ్యంతో ఈ అసమ్మతి డ్రామా అడిదిస్తున్నారని జేడీ(ఎస్) నేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఆరోపించారు. సిద్ధరామయ్య కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ దూతలకు చెప్పేశారు. 

తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాజీనామా లేఖలు సమర్పించిన 14 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య మద్దతుదారులేనని దేవెగౌడ ఆరోపించారు. ప్రస్తుతరాజకీయ సంక్షోభం వెనుక సిద్ధరామయ్య ఉన్నారనే విషయం తనకు తెలుసునని, రాజీనామా చేసినవారంతా ఆయన మద్దతుదారులేనని దేవెగౌడ తెలిపారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా ఉన్న పేరున్న డీకే శివకుమార్  తనను కలుసుకున్న సందర్భంగాలోనూ దేవెగౌడ ఇవే ఆరోపణలు చేసినట్టు సమాచారం.  కుమారస్వామి స్థానే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేస్తేనే ప్రభుత్వాన్ని కాపాడుకోగలమని.. ఇదొక్కటే సమస్యకు పరిష్కారమంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనను డీకే వివరించడం.. దాన్ని దేవెగౌడ తోసిపుచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ ఇదే తాము పక్కకు తప్పుకుంటామని కూడా.. గౌడ హెచ్చరించినట్టు ప్రచారమవుతోంది.

ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే.. సిద్ధరామయ్య, దేవెగౌడ మధ్య 2005లో శత్రుత్వం మొదలైంది. దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామిని సవాలు చేస్తూ జేడీ(ఎస్)ను సిద్ధారామయ్య వదిలేసి కాంగ్రెస్ లో చేరారు. ఆనాడే  జేడీఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తానంటూ సిద్ధరామయ్య ప్రతినబూనారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here