Home జాతీయం ఆనాడు సాక్షికి.. ఇప్పుడు టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

ఆనాడు సాక్షికి.. ఇప్పుడు టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

165
0

కలానికి సంకెళ్లా..? ఫోర్త్​ ఎస్టేట్​కు ఆటంకాలా..? ఇంత అధికార దుర్వినియోగమా..? ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న జర్నలిజం ‘గోస’. ఏపీలో వైఎస్సార్​ కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్​ ఎఫెక్ట్​ టీవీ 5 అనబడే 24 గంటల వార్తా ఛానల్​కు ముఖ్యమంత్రి జగన్​ చెక్​ పెట్టారు. ఆ ఛానల్​ ఏపీలో అవసరం లేదు. తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోండి అని హుకూం జారీ చేశాడని ప్రచారం జరిగింది. ఇందులో నిజమూ ఉంది. ఇప్పుడు ఏబీఎన్​ ఆంధ్రజ్యోతిపై అప్రకటిత నిషేధం విధించారు. ఈ రెండు ఛానళ్లు ఏపీలో ప్రసారం కావడం లేదు. ఈ ఛానళ్ల యాజమాన్యాలు వేర్వేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సరే విషయానికొద్దాము.

ఇప్పుడు ఈ రెండు ఛానళ్లు, వాటి ప్రతినిధులు.. కలానికి సంకెళ్లా.? ఫోర్త్​ ఎస్టేట్​కు ఆటంకాలా..? అని నినదిస్తున్నారు. ఇదే నినాదం ఏపీలో టీడీపీ గవర్నమెంట్​ అధికారంలో ఉండగా.. సాక్షి అనబడే న్యూస్​ ఛానల్​పై ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రకటిత నిషేధం విధించారు. టీడీపీ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు ఆహ్వానం లేకుండా చేశారు. ఇలా ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఆనాడు సాక్షి ఛానల్​, పత్రిక కూడా ఇదే విధంగా కలానికి సంకెళ్లా..? ఫోర్త్​ ఎస్టేట్​కు ఆటంకాలా.? అని నినదించింది. ఆరోజు మిగిలిన ఛానళ్లు తమకెందుకులే.. తమ కడుపులో చల్ల కదలకుండా ఉన్నామని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి టీవీ 5, ఏబీఎన్​ ఆంధ్రజ్యోతికి వచ్చింది. సాక్షి మౌనంగా ఉంది. అంతెందుకు ఆనాడు.. ఈరోజు.. ఈనాడు అనబడే పేపరు, ఈటీవీ ఛానల్​ ఏనాడు అప్రకటిత నిషేధానికి గురి కాలేదు. ఎందుకూ..?

ఈనాడు.. టీడీపీకి డబ్బా కొట్టే పేపరని అందరికీ తెలుసు. కానీ, ఆ పేపరు ఏనాడు పూర్తి ఏకపక్షంగా రాయలేదు. కాకుంటే టీడీపీవైపు మొగ్గు చూపించింది. కానీ ఈరోజు టీవీ 5, ఏబీఎన్​ ఆంధ్రజ్యోతి ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్​కు ఏ విధంగా వ్యతిరేకం రాశాయో అందరికీ తెలుసు. అంతెందుకు పోలింగ్​ ముగిసిన తర్వాత కూడా రిజల్ట్​కు ముందురోజు కూడా వైసీపీ ఓడిపోతుంది. టీడీపీ గెలుస్తుందనే రాశాయి.. ప్రసారం చేశాయి. ఇప్పుడు జగన్​ అధికారంలో ఉన్నారు. అందుకే తన చేతిలో ఉన్న ఆయుధాన్ని వాడుకుంటున్నారు. రేపు ఇంకెవరో అధికారంలోకి వస్తారు. అపుపడు అతడే ఆయుధాన్ని ఉపయోగించుకుంటాడు. ఏదో ఛానల్​ లేదా పేపర్​పై నిషేధం విధిస్తాడు. ఇందులో ఎంత మాత్రం తేడా ఉండదు. ఎందుకంటే జర్నలిజం అనేది ఇప్పుడు ప్రజల పక్షం లేదు. పార్టీల పక్షంలో ఉంది. జనం కూడా జర్నలిజం పక్షాన లేరు. వారికి నిజాలు తెలిసి పోయాయి. అందుకే మౌనంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here